నేనెలా ఉంటే మీకేంటి? ఏఆర్ రెహమాన్ కూతురి సూటి ప్రశ్న

ఏఆర్ రెహమాన్ కూతురు సింగర్ ఖతీజా రెహమాన్ ఫరిష్టోన్ ద్వారా బిగ్ ఎంట్రీ ఇచ్చారు. మున్నా షెకావత్ అలీ రాసిన ఈ పాటను తండ్రి సహకారంతో పాడారు. ఈ సందర్భంగా ఖతీజాతో ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూ నిర్వహించి ఆమె వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకుంది.
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి ఎంట్రీ ఈజీ అయిందా?
నిజానికి ఎంట్రీ దొరకడం ఈజీయే. కానీ, ఈ ట్రాక్‍లో వెళ్లాలంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. చాలా బాధ్యతలు ఉంటాయి. నా ఫస్ట్ సాంగ్ పాడాను. దేవుడి దయ వల్ల అది బాగానే వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను పరవాలేదని.
మనకు అటెన్షన్ అవసరం లేకపోయినా.. సోషల్ మీడియా మొత్తం మన గురించే మాట్లాడుకుంటుంది. అది మంచికో చెడుకో తెలియదు కానీ… మన గురించి తెలియకపోయినా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ముఖంపై ముసుగు ధరించాలనుకోవడం అనేది మన ఛాయీస్. అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీ ఇష్టం.
తస్లీమా నస్రీన్ కేస్ ఏమైందో మీకు తెలుసు కదా?
నిజంగానే అది నాపై ప్రభావం చూపించింది. అదంత సులువు కాదు. కానీ, నేను రియలైజ్ అవగలిగాను. కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నా.. ఇప్పుడంతా బాగుంది. నన్ను జడ్జ్ చేయాలనుకునేవారికి, ప్రత్యేకించి మహిళలపై మాటలు వదిలేసే వాళ్లకు అది బాగా సరిపోతుంది. మగాళ్లు ఎప్పుడూ టార్గెట్ అవరు. మహిళలకే ఆ కష్టాలు.
మహిళలు సాధారణ కుటుంబాల నుంచి లేదా పేరున్న కుటుంబాల నుంచి వచ్చారా అనేది విషయం కాదు. కొందరు పనీపాట లేకుండా కూర్చుంటారు. వాళ్లకు చాలా సమయం ఉంటుంది. అదే పనిగా కూర్చొని స్క్రీన్‌షాట్లు తీసి ప్రచారం చేస్తుంటారు. ‘ఓహ్.. అరుదైన బుర్ఖా సింగర్లలో నువ్వూ ఒకరా!’ అంటూ కామెంట్లు చేస్తారు. ఆ పనులే చెప్తుంటాయి వాళ్ల స్వభావాల గురించి.
https://10tv.in/megastarchiranjeevi-konidela-tests-positive-for-coronavirus/
ఇవన్నీ ఎందుకు చేయాలి? నా వరకూ వచ్చేసరికే ఎందుకంత డిఫరెన్స్ చూపించాలి.? హాలీవుడ్‌లో మార్ష్‌మెల్లో గురించి ఎవరూ మాట్లాడరెందుకు. నన్ను మాత్రమే ఎందుకు? నేను బట్టలు కురచగా ఎందుకు వేసుకోవాలి. నా ముఖంపై ముసుగు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి? అది మీ సమస్య కాదు కదా? నా గురించి నేను వివరించుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేయదలచుకోలేదు. ప్రతి విషయం టీఆర్పీల చుట్టూ తిరుగుతుండటం విషాదకరం. మీరూ అదే చేస్తున్నారు.
ఖతీజా.. భక్తి నుంచి మీరు చేసేపనిలో ఐడెంటిటీని, కాన్ఫిడెన్స్‌ను ఎలా సంపాదించుకున్నారు. ఇతరులకు మీరిచ్చే సందేశం ఏంటి. మిమ్మల్ని ఆన్‌లైన్‌లో చూసి ఎవరు ఫాలో అవుతారనుకుంటున్నారు?
నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అనుకుంటున్నా. నా కనుబొమ్మలు షేప్ చేసుకోలేదని నన్ను అడగొచ్చు. నాకు నన్ను ఫిజికల్ గా చూపించుకోవడం కంటే ఇలానే బెటర్ అని అనుకుంటున్నాను. నిజాయతీగా చెప్పాలంటే అదే నాకు కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. ఇలా ఉండటం నాకేం చెడుగా అనిపించలేదు. నాలా నేనుండటం నాకు బాగానే ఉంది. అదే నా ఆధ్యాత్మికత, నమ్మకం నాకు నేర్పించాయి. ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ దారిలో నేను సాగలేను. మమ్మల్ని ఇతరులతో పోల్చి చూడడం నాకు ఇష్టం ఉండదు. అలాంటివి నేను చేయను ఎందుకంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను.