Will Manchu Vishnu Act Free for Prabhas if gets Chance in Spirit After Kannappa
Prabhas – Manchu Vishnu : మంచు విష్ణు గత కొన్ని రోజులుగా కన్నప్ప సినిమాతో, మంచు ఫ్యామిలీ వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టు అని మంచు విష్ణు కన్నప్ప సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సౌత్ టు నార్త్ చాలా మంది సెలబ్రిటీలు గెస్ట్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇటీవలే కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నట్టు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాత్రని ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఫ్రీగా చేస్తున్నాడు. ఈ విషయం విష్ణునే అధికారికంగా చెప్పాడు. సాధారణంగా మంచు విష్ణు కామెంట్స్, సినిమాలు ట్రోల్స్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు అని ప్రకటించినప్పుడే ఏం చెప్పి ఒప్పించావు, ఎలా ఒప్పించావు అని కూడా సరదాగా ట్రోల్ చేసారు.
ఇటీవల ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నామని, కాస్త సినిమా, థియేటర్ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోండి అని ప్రకటించారు. దీంతో ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించడానికి చాలా మంది అప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే మంచు విష్ణు నేను కూడా స్పిరిట్ సినిమాలో నటించడానికి అప్లై చేశాను. ఛాన్స్ కోసం ఎదురుచూస్తాను అని ట్వీట్ చేసారు.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి మంచు విష్ణుని ట్రోల్ చేసారు. నీ సినిమాకు హైప్ కోసం ప్రభాస్ ని తెచ్చుకున్నావు. ప్రభాస్ సినిమాలో నువ్వెందుకు? సందీప్ రెడ్డి వంగ స్టైల్ వేరు, నీకు ఛాన్స్ ఇస్తాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది ఛాన్స్ ఇస్తే నువ్వు ప్రభాస్ లాగా ఫ్రీగా చేస్తావా? ప్రభాస్ నీ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాడు, నువ్వు ప్రభాస్ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేస్తావా అని కూడా అడుగుతున్నారు.
మరి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మంచు విష్ణుని తీసుకుంటాడా? ఏదైనా గెస్ట్ పాత్ర ఇస్తాడా? ఇస్తే మంచు విష్ణు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేస్తాడా చూడాలి. ఇక సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా డిసెంబర్ లో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.