Manchu Manoj : చంద్రగిరిలో మంచుమనోజ్.. జల్లికట్టు వేడుకలకు గెస్ట్ గా.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..
తాజాగా మంచు మనోజ్ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

Manchu Manoj Went to Chandragiri Jallikattu Festival as Guest
Manchu Manoj : మంచు మనోజ్ గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా మనోజ్ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. తాజాగా మంచు మనోజ్ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
మంచు మనోజ్‌కు అక్కడి టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఎన్టీఆర్ – మంచు మనోజ్ కి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అందులోను తిరుపతి ఏరియాలో మంచు కుటుంబానికి పలుకుబడి ఉంది. దీంతో మంచు మనోజ్ చంద్రగిరి జల్లికట్టు వేడుకలకు వెళ్లడంతో అభిమానులు భారీగా హాజరయి ఆహ్వానం పలికారు. మనోజ్ కార్ టాప్ నుంచి ఫ్యాన్స్ కి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడు.
ఈ జల్లికట్టు వేడుకల్లో పాల్గొన్న మంచు మనోజ్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుండి జల్లికట్టు పండుగను గ్రాండ్ గా చేసుకుంటున్నాం. సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత 20 ఏళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం గొప్ప విషయం. తమిళనాడు జల్లికట్టుతో పోల్చుకుంటే ఇక్కడ అంత సివియర్‌గా ఉండదు. ఇక్కడ అంతా సాప్ట్‌గా ఉంటుంది. పశువుల పండగగా చాలా భక్తితో జరుపుకుంటాం. పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా ఇక్కడ ఈ వేడుకను జరుపుకుంటాం. ఈ జల్లికట్టుని ప్రజలు పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇందులో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
Also Read : Venky Atluri : మళ్ళీ బయటి హీరోతోనే.. ఈ డైరెక్టర్ పని బాగుందిగా.. ఇంకో హిట్ పక్కా..