Rajendra Prasad : మూడు నెలలు తిండిలేకుండా.. చనిపోవాలన్న ఆలోచన..రాజేంద్ర ప్రసాద్ కన్నీటి కథ

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Rajendra Prasad : మూడు నెలలు తిండిలేకుండా.. చనిపోవాలన్న ఆలోచన..రాజేంద్ర ప్రసాద్ కన్నీటి కథ

Without food for three months Senior actor Rajendra Prasad emotional journey

Updated On : November 30, 2024 / 7:42 PM IST

Rajendra Prasad : సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, సహ నటుడిగా, కమెడియన్ గా, ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు.

అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో పలు షాకింగ్ విషయాలు తెలిపారు. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని షాకింగ్ విషయం చెప్పారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం కూడా తినలేదని చెప్పుకొచ్చారు.

Also Read :Pawan Kalyan : సుజిత్ సినిమాటిక్ యూనివర్స్.. పవన్ ఓజిలో ప్రభాస్ నిజంగానే ఉన్నడా? 

అంతేకాక..‘‘మా నాన్న స్కూల్‌ టీచర్‌.. చాలా కఠినంగా ఉంటారు. నేను ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. అందుకు మా నాన్న ఒప్పుకోలేదు. ‘నీ ఇష్టానికి వెళ్తున్నావు.. సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ ఏది వచ్చినా అది మాకు సంబంధం లేదు. ఒకవేళ ఫెయిల్‌ అయితే అస్సలు ఇంటికి రావద్దు’ అని అన్నారంటూ తెలిపారు. ఆయన మాటలకి చాలా బాధపడ్డా. మద్రాస్‌ వచ్చి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించా. కానీ అవకాశాలు మాత్రం లేవు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్లా. అప్పుడు మా నాన్న ‘రావద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు’ అని తిట్టారు. అది తట్టుకోలేక వెంటనే మద్రాస్‌ వచ్చేశా. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక చనిపోదామనుకున్నా అని చెప్పుకొచ్చారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.