Surekha Konidela: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. మెగాస్టార్ భార్యకు స్థానం.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
Surekha Konidela: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. (Yadagirigutta)
Yadagirigutta Temple Board Announce Chiranjeevi Wife Surekha Konidela as Member
Surekha Konidela: తిరుమల తిరుపతి దేవస్థానంలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నూతన బోర్డుకు చైర్మన్గా ఎం.సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. బోర్డులో చైర్మన్తో పాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో సభ్యులుగా మొత్తం 18 మందికి చోటు దక్కింది.
ఈ బోర్డులో మెంబర్ గా చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు చోటు దక్కడం గమనార్హం. బోర్డు ఫర్ యాదగిరి గుట్ట దేవస్థానం సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఏం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్ – ది ఫౌండర్ ట్రస్టీ ఉన్నారు.
Also Read : హాస్పిటల్లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. వారణాసి, దేవర సినిమాలతో టాలీవుడ్ లో కూడా ఫేమ్..
ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రధాన అర్చకులు ఉన్నారు.

