తమిళనాట ‘యమదొంగ’ – తారక్‌కు గ్రాండ్ వెల్‌కమ్!
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’ తమిళనాట ‘విజయన్’ పేరుతో నవంబర్ 29న విడుదల కానుంది..

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’ తమిళనాట ‘విజయన్’ పేరుతో నవంబర్ 29న విడుదల కానుంది..
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’.. 2007 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తారక్ నటన, రాజమౌళి టేకింగ్, కీరవాణి సంగీతం, సెంథిల్ ఫోటోగ్రఫీ సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి.. యమధర్మరాజుగా మోహన్ బాబు, ఆయన భార్యగా ఖుష్బూ, నారదుడిగా నరష్ నటించగా మమతా మోహన్‌దాస్, అలీ కీలక పాత్రలు చేశారు. రంభ, ప్రీతిజింగానియా, అర్చన, నవనీత్ కౌర్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు.
దాదాపు 12 సంవత్సరాల తర్వాత ‘యమదొంగ’ తమిళ్‌లో రిలీజ్ కానుంది. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’, ‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాలు తమిళనాట నేరుగా విడుదలయ్యాయి. అందులో ఐదు చిత్రాలు తమిళంలో రీమేక్‌గానూ, రెండు చిత్రాలు అనువాదంగానూ విడుదలయ్యాయి.
ఇప్పుడు యమదొంగ చిత్రాన్ని ‘విజయన్’/‘ఇవన్ ఎమకాదగన్’ పేరుతో విడుదల చేయనున్నారు. అజిత్, విజయ్, సూర్య ఫ్యాన్స్ ట్విట్టర్‌లో తారక్‌కి వెల్‌కమ్ టు కోలీవుడ్ తారక్ అన్న అంటూ పోస్టులు చేస్తున్నారు. నవంబర్ 29న ‘విజయన్’ తమిళనాట విడుదల కానుంది. మ్యూజిక్ : కీరవాణి, కథ : విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.