Yamadonga : యమదొంగ ఎన్టీఆర్ కోసం కాదు.. ఆయన కోసం రాసుకున్న కథ.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు యమదొంగ సినిమా ఎన్టీఆర్ కోసం రాసుకున్నది కాదు అంటూ వ్యాఖ్యలు చేసారు. (Yamadonga)
Yamadonga
Yamadonga : ఎన్టీఆర్ – రాజమౌళి కెరీర్లో హిట్ సినిమాల్లో యమదొంగ ఒకటి. టాలీవుడ్ హిట్ ఫార్ములా యముడు – మనిషి, యమలోకానికి మనిషి వెళ్లి మళ్ళీ కిందకు వచ్చే పాయింట్ తో ఈ కథని రాసుకున్నారు. యమదొంగ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు యమదొంగ సినిమా ఎన్టీఆర్ కోసం రాసుకున్నది కాదు అంటూ వ్యాఖ్యలు చేసారు.
Also Read : Vijayendra Prasad : మోదీ ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకున్నా.. మోదీ ఫోన్ చేసి.. రాజమౌళి తండ్రి వ్యాఖ్యలు వైరల్..
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. యమదొంగ సినిమా మోహన్ బాబు కోసం రాసుకున్న కథ. నరకంలో ఏది తక్కువ ఉంటే ముందు అది అనుభవించేలా చేస్తారు అని పురాణాల్లో ఉంది. పుణ్యం తక్కువ ఉంటే ముందు స్వర్గానికి పంపిస్తారు. పాపం తక్కువ ఉంటే ముందు నరకానికి పంపిస్తారు. అయితే సగం సగం ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్న అడిగారు. అప్పుడు అది హీరో పాత్ర అవుతుంది. యముడు అలంటి మనిషిని ఇంకా తప్పులు చేయమని భూమికి పంపిస్తాడు అని కథ రాసుకున్నాం.
ఈ కథ ఎప్పుడో రాసుకున్నది. ముందే రాజమౌళికి తెలుసు ఈ కథ. ఓ రోజు వచ్చి ఆ కథతో సినిమా చేద్దాం అని అడిగాడు రాజమౌళి. ఇది ఎన్టీఆర్ కోసం కాదు మోహన్ బాబు కోసం రాసుకున్న కథ అని అన్నారు.
