Vijayendra Prasad : మోదీ ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకున్నా.. మోదీ ఫోన్ చేసి.. రాజమౌళి తండ్రి వ్యాఖ్యలు వైరల్..
తాజాగా విజయేంద్రప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యసభ పదవి గురించి మాట్లాడారు. (Vijayendra Prasad)
Vijayendra Prasad
Vijayendra Prasad : రాజమౌళి తండ్రి, రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ కి బీజేపీ పార్టీ రాజ్యసభ ఎంపీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయేంద్రప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యసభ పదవి గురించి మాట్లాడారు.
Also Read : Sing Geetham : తెలుగు సినిమాకు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎందుకంటే..?
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఓ రోజు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు ఓ బాధ్యత అప్పగిద్దాం అనుకుంటున్నాము. అప్పుడప్పుడు ఢిల్లీ రావాల్సి ఉంటుంది అన్నారు సరే అన్నాను. ఆ తర్వాత రోజు ఒక ఫోన్ వచ్చింది. నేను పీఎం మోదీ సెక్రటరీని మోదీ గారు మాట్లాడతారు అని ఇచ్చారు. మోదీ గారు హిందీలో మాట్లాడుతుంటే నాకు హిందీ రాదు అని చెప్పాను. దాంతో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు. రాజ్యసభ పదవి మీకు ఇద్దామనుకుంటున్నాను ఓకే నా అని అడిగారు. నేను ఓకే అన్నాను. అయితే అది నేను ప్రాంక్ కాల్ అనుకున్నాను. మోదీ నాకు ఎందుకు కాల్ చేస్తాడు అనుకున్నా. అందుకే ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు సాయంత్రం వార్తల్లో వచ్చాక నిజమే అని అర్ధమయింది.
ఆ తర్వాత మోదీ గారిని కలిసినప్పుడు అడిగాను నాకు రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అని. నేను గతంలో ఓ ఇంటర్వ్యూలో RRR సినిమా ఎత్తర జెండా పాటలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు పెట్టి గాంధీ, నెహ్రుల ఫోటోలు ఎందుకు పెట్టలేదు, పటేల్ – గాంధీ – నెహ్రుల గురించి మాట్లాడాను. ఇండియా మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎన్నికయ్యారు అని మొత్తం చెప్పాను. అది ఎవరో మోదీ గారికి చూపించారట. అలాగే సినిమాల్లో నేను రచయితగా చేసిన సేవలు కూడా తెలుసుకొని నాకు ఇచ్చాము అన్నారని తెలిపారు.
