Yash : సీనియర్ నటి సుమలత కొడుకు పెళ్లిలో హీరో యశ్ సందడి.. డాన్స్ వీడియో వైరల్!

సీనియర్ నటి సుమలత కొడుకు పెళ్లి ఇటీవల జరిగిన విష్యం తెలిసిందే. ఇక మ్యారేజ్ ఫంక్షన్ లో యశ్ కొత్త జంటతో కలిసి డాన్స్ చేసి అదరగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Yash dance video at Sumalatha son marriage function gone viral

Yash – Sumalatha : సీనియర్ నటి మరియు కర్ణాటక లోక్ సభ ఎంపీ అయిన సుమలత ఇటీవల తన కుమారుడు అభిషేక్ అంబరీష్‌ (Ambareesh) వివాహం ఘనంగా చేశారు. కర్ణాటకలోని ఒక ప్యాలస్ లో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామరాజు వంటి రాజకీయ నాయకులతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu), కేజీఎఫ్ స్టార్ యశ్ (Yash) వంటి సినీ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు.

Adipurush : ఆ థియేటర్స్‌లో ఆదిపురుష్ నో రిలీజ్.. కలెక్షన్స్‌కి దెబ్బ పడనుందా..?

ఇక పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో యశ్ మరియు మరో స్టార్ హీరో దర్శన్‌ (Darshan Thoogudeepa) పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజి పై డాన్స్ చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇదే పార్టీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప లతో పాటు చిరంజీవి దంపతులు, జాకీష్రాఫ్‌, ఖుష్బూ తదితరులు హాజరయ్యి కొత్త జంటను ఆశ్వీరదించారు.

Bandla Ganesh : బాలయ్యతో కాదు పవన్‌తో సినిమా తీయడం నా డ్రీమ్.. నాగవంశీకి బండ్ల గణేష్ ట్వీట్!

కాగా యశ్ సినిమాల విషయానికి వస్తే.. కేజీఎఫ్ 2 (KGF 2) తరువాత ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు. తన సినిమా కోసం కన్నడ ఆడియన్స్ తో పాటు పాన్ ఇండియా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సలార్ (Salaar) సినిమాలో యశ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. కేజీఎఫ్ 2 ని కనెక్ట్ చేసేలా యశ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు.