Yash : యశ్ ఉగ్రరూపం.. 20కిలోలు పెరిగాడు!

వెండితెరపై రావణుడి పాత్ర అంటే కొద్ది మంది పాతతరం హీరోలే గుర్తుకు వస్తారు.

Yash : యశ్ ఉగ్రరూపం.. 20కిలోలు పెరిగాడు!

Yash Gained 20kgs For Ramayanam Movie

వెండితెరపై రావణుడి పాత్ర అంటే కొద్ది మంది పాతతరం హీరోలే గుర్తుకు వస్తారు. ప్రస్తుత తరం నటులు ఎవరూ పౌరాణిక పాత్రలు చేయకపోవడంతో ఏ నటుడినీ రావణుడి పాత్రలో ఊహించలేకపోతున్నాం.. ఐతే ఈ లోటు తీర్చేందుకు తెగ శ్రమిస్తున్నాడట కన్నడ కథానాయకుడు యష్. రణబీర్‌ కపూర్‌, సాయిపల్లివి కాంబోలో చిత్రీకరిస్తున్న పాన్‌ ఇండియా మూవీ రామాయణ్‌లో రావణుడిగా కనిపించబోతున్న యష్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం…

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్‌ హీరో యష్‌… మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నాడు. రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యష్‌. మూడు పార్ట్‌లుగా వస్తున్న ఈ సినిమాలో సెక్ండ్ పార్ట్ మొత్తం రావణుడి పాత్రపైనే ఉంటుందని చెబుతున్నారు.

Devara : లాస్ట్ నలభై నిమిషాలు వేరే లెవల్.. బాలీవుడ్‌లో దేవరపై ఎన్టీఆర్ కామెంట్స్..

ఇందులో రావణాసురిడి విశ్వరూపం చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు రావణుడిని చూపించని యాంగిల్‌ ఈ సినిమాలో చూపిస్తారని చెబుతున్నారు. రాముడు.. రావణుడి మధ్య యుద్ధ సన్నివేశాల కోసం స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నారని ఇండస్ట్రీ టాక్‌.

ప్రస్తుతం టాక్సిక్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు యష్. ఈ సినిమా 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రామాయణం పార్ట్ 2 కూడా 2025లో స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చూడని రావణుడిని ఆన్ స్ర్కీన్ మీద చూడబోతున్న యష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైయిట్ మెంట్‌తో ఉన్నారు. రావణుడి పాత్ర కోసం సుమారు 20 కిలోల బరువు పెరిగిన యష్‌… రావణుడి పాత్ర కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Mahesh Babu : మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మ‌హేశ్ బాబు..