Yash Toxic Movie Shooting Happened in Kannada and English Also
Yash Toxic : కేజిఎఫ్ తర్వాత యశ్ ఫ్యాన్స్ ఎంతగానో యశ్ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ కేజిఎఫ్ తర్వాత డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యశ్, వెంకట రమణ నిర్మిస్తున్నారు.
అయితే టాక్సిక్ సినిమాని కేవలం పాన్ ఇండియా రిలీజ్ మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. అందుకు టాక్సిక్ సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్’ సినిమా ఇంగ్లీష్ మరియు కన్నడ రెండు భాషల్లో తెరకెక్కిస్తున్న మొట్టమొదటి బిగ్ స్కేల్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించనుంది. అలాగే ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘టాక్సిక్’ సినిమా కోసం మేము ఒక అంతర్జాతీయ స్థాయి కథను సృష్టించాలనుకున్నాం. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ సినిమాని షూట్ చేస్తున్నాం. ఈ సినిమా సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది అని తెలిపారు.
నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. టాక్సిక్ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే సినిమాగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. టాక్సిక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాతో మరోసారి భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది అని అన్నారు.
Also Read : NTR – Devara : జపాన్ లో ‘దేవర’ రిలీజ్.. ప్రమోషన్స్ కోసం మళ్ళీ జపాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఫొటో వైరల్..
ఇక ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను రూపొందించేందుకు జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీని తీసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘డ్యూన్: పార్ట్ 2’ సినిమాకు బీఏఎఫ్టీఏ అవార్డు గెలుచుకున్న DNEG స్టూడియో పని చేస్తోంది. ఇటీవల యశ్ పుట్టినరోజు నాడు చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.