నీకో కథ చెప్తా.. ‘ఏడు చేపల కథ’ – ట్రైలర్

యస్‌జే చైతన్య దర్శకత్వంలో, జివియన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ‘ఏడు చేపల కథ’ నవంబర్ 7న రిలీజ్ కానుంది..

  • Published By: sekhar ,Published On : October 14, 2019 / 08:15 AM IST
నీకో కథ చెప్తా.. ‘ఏడు చేపల కథ’ – ట్రైలర్

Updated On : October 14, 2019 / 8:15 AM IST

యస్‌జే చైతన్య దర్శకత్వంలో, జివియన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ‘ఏడు చేపల కథ’ నవంబర్ 7న రిలీజ్ కానుంది..

కొద్ది నెలల క్రితం ‘ఏడు చేపల కథ’ అనే సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది గుర్తుందా? యూత్‌కి మతిపోగొట్టే సరుకంతా ఆ టీజర్‌లో ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత అదే కంటెంట్‌తో మరికొన్ని టీజర్లు రిలీజవడంతో ‘ఏడు చేపల కథ’ని మర్చిపోయారు ఆడియన్స్.

టీజర్ రిలీజయ్యాక బిజినెస్ డీల్ కూడా బాగానే జరిగిందని టాక్ వచ్చింది అప్పట్లో.. ఇప్పుడు తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. తలసేమియా పేషెంట్.. టెంప్ట్ రవిగా అభిషేక్ పర్ఫార్మెన్స్ నేచురల్‌గా ఉంది.

Read Also : అతను జంతువులతో మాట్లాడతాడు : ‘డూలిటిల్’ – ట్రైలర్

ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే రచ్చ రంబోలా చేసేశారు. చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై, యస్‌జే చైతన్య దర్శకత్వంలో, జివియన్ శేఖర్ రెడ్డి నిర్మించిన ‘ఏడు చేపల కథ’ నవంబర్ 7న రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది. సంగీతం : ఎమ్‌టి కవి శంకర్.