Divi : వామ్మో దివి ఇంత చదువుకుందా? ఇంట్లో అందరూ సెంట్రల్ గవర్నెమెంట్ ఉద్యోగులే.. సినిమాలు అంటే ఇంట్లోంచి వెళ్లిపొమ్మని..

ఇంటర్వ్యూలో దివి తన చదువు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పింది.

You Must Shocked after Knowing about Actress Divi Study and Family Background

Divi : బిగ్ బాస్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది నటి దివి. చదువుకునేటప్పటి నుంచే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన దివి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత మాత్రం దివి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయి తన ఫొటోలతో హల్ చల్ చేసింది. అక్కడ్నుంచి వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం దివి వరుస సినిమాలతో బిజీగానే ఉంది.

తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో దివి తన చదువు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పింది.

Also Read : Ibrahim Ali Khan : ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ పై అటాక్.. ఓ పక్క కేసు నడుస్తుంటే.. సైఫ్ కొడుకుని హీరోగా ప్రకటించిన కరణ్ జోహార్..

దివి మాట్లాడుతూ.. నేను బి.టెక్, ఎం.టెక్ చేశాను. Phd కూడా చేయాలనుకున్నాను. నాకు జాబ్స్ ఇష్టం లేదు. నేను కవితలు కూడా రాస్తాను. చదువుకునేటప్పట్నుంచే మోడలింగ్ చేశాను. నా అంతట నేను బతకాలి అని అనుకున్నాను. చదువు అయ్యాక నా కాలేజీ వాళ్ళే నాకు లెక్చరర్ గా జాబ్ ఇస్తామని పిలిచారు. ఓ సబ్జెక్టులో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నేను బాగా చదువుతాను అని తెలిపింది.

వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తూ.. మా అమ్మ, నాన్న, మా అన్న అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులే. మా అమ్మ, అన్న Phd లు చేసారు. అమ్మ, అన్న ఇద్దరూ ప్రొఫెసర్స్. నేను కూడా మొదట టీచింగ్ జాబ్ కే వెళ్లాలని అనుకున్నాను కానీ జాబ్ చేయడం నచ్చలేదు అని చెప్పింది. అలాగే.. నేను బిగ్ బాస్ షోకి వచ్చేవరకు నన్ను ఇంట్లో తిట్టేవాళ్ళు ఏమి చేయట్లేదని, డబ్బులు సంపాదించట్లేదని. రోజంతా పడుకునేదాన్ని, ఆడిషన్స్ ఉంటే ఆటోలో వెళ్లేదాన్ని, ఇంట్లో అందరూ జాబ్స్ చేస్తుంటే నేను సినిమాల ఛాన్సుల కోసం తిరుగుతుంటే నన్ను ఏం చెయ్యవా అంటూ తిట్టేవాళ్ళు. ఒక్కోసారి ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని కూడా తిట్టారు. కానీ కొన్ని సార్లు సపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉంటున్నాను. అమ్మవాళ్ళు దగ్గర్లోనే వేరే చోట ఉంటారు అని తెలిపింది.

Also Read : Siva Karthikeyan – Vijay Antony : ఇదెక్కడి కో ఇన్సిడెన్స్.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరికీ 25వ సినిమా.. ఒకే రోజు ఒకే టైటిల్ తో సినిమా అనౌన్స్..

ఇక దివి ఇటీవలే పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేతిలో పలు సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం కాలికి దెబ్బ తగిలిందని, కట్టు కట్టారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేదని సమాచారం.