Balakrishna : అందరికి బాలయ్యే కావాలి.. ఎక్కడ చూసినా బాలయ్య బాబు హవా నడుస్తుంది..

ఎవర్ యంగ్ ఎనర్జీతో పనిచేసే బాలయ్య కోసం డైరెక్టర్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పటిలా సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ప్రయోగాలు కూడా ట్రై చేస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం............

Balakrishna : అందరికి బాలయ్యే కావాలి.. ఎక్కడ చూసినా బాలయ్య బాబు హవా నడుస్తుంది..

Young Directors want to do movie with Balakrishna

Updated On : November 1, 2022 / 8:25 AM IST

Balakrishna :  ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలయ్యే కనిపిస్తున్నాడు. సినిమాల్లో, స్మాల్ స్క్రీన్ లో, ఓటీటీ లో, యాడ్స్ లో ఎక్కడ చూసినా బాలకృష్ణ హవానే నడుస్తోంది. అఖండ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఆ తర్వాత అన్ స్టాపబుల్ షోతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక యాడ్స్ కూడా ఒప్పుకోవడం మొదలుపెట్టారు. మరో పక్క రాజకీయాలతోను బిజీగా ఉన్నారు. బాలయ్య హవా ఇప్పుడు హద్దులు దాటేసింది. వరుస సినిమాలని లైన్లో పెడుతున్నారు. అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆయన నుంచి ఇంకేమన్నా కొత్త అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. అంతలా బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు ప్రస్తుతం.

అందుకే డైరెక్టర్లు కూడా ఈ నందమూరి హీరో వెంటే పడుతున్నారు. మాకు బాలయ్యే కావాలంటున్నారు. ఒకప్పుడు బాలయ్య తో ఎందుకురా బాబో అనుకునే యంగ్ డైరెక్టర్లు ఇప్పుడు ఆయనకోసమే కథలు రాస్తున్నారు. ఆయనే కావాలంటున్నారు. అన్ స్టాపబుల్ గా దూసుకెళుతున్నారు బాలయ్య. కెరీర్ లో ఎప్పుడూ లేనన్ని ప్రయోగాలు చేస్తున్నారు. సినిమాలు ఒక్కటే కాకుండా ఓటీటీలో టాక్ షో చేస్తున్నారు. మరో వైపు ఇన్నేళ్ళుగా లేని యాడ్స్ లోకి కూడా వచ్చేశారు. మరో వైపు యంగ్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా బాలయ్యే కనిపిస్తున్నారు. యంగ్ జనరేషన్ తో ఎక్కువగా కనెక్ట్ అవుతున్న బాలయ్య కోసం యంగ్ డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు.

ఎవర్ యంగ్ ఎనర్జీతో పనిచేసే బాలయ్య కోసం డైరెక్టర్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పటిలా సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా ప్రయోగాలు కూడా ట్రై చేస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సరికొత్త సినిమాకి రెడీ అవుతున్నారు.

Abhiroop Basu : ఆ సినిమాలో ఏముందని ఎగబడుతున్నారు? ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా బాలయ్య కోసం కథ రాస్తున్నానని, త్వరలోనే స్టోరీ సిటింగ్ ఉందని చెప్పాడు. పరశురామ్ కంటే ముందే వెంకీ కుడుములతో బాలకృష్ణ సినిమా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో యాడ్స్ తో బాలయ్యని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో సినిమా చేయాలి అన్నాడు. కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా బాలయ్యతో ఎప్పటికైనా సినిమా చేస్తానని అన్నాడు. ఇప్పుడు యువ హీరోలంతా బాలయ్య వెంటపడుతున్నారు. మరి ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య నుంచి ఎలాంటి సినిమాలు వచ్చి ప్రజలని అలరిస్తాయో చూడాలి.