Naga Anvesh : త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యువ హీరో..

నిర్మాత సింధురపువ్వు కృష్ణ రెడ్డి తనయుడు, యువ హీరో నాగ అన్వేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు'.. లాంటి కొన్ని సినిమాలలో బాల నటుడిగా.......

Naga Anvesh :  త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యువ హీరో..

Anvesh

Updated On : February 22, 2022 / 7:38 AM IST

Naga Anvesh Wedding :  నిర్మాత సింధురపువ్వు కృష్ణ రెడ్డి తనయుడు, యువ హీరో నాగ అన్వేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’.. లాంటి కొన్ని సినిమాలలో బాల నటుడిగా అలరించి తర్వాత హీరోగా మారాడు నాగ అన్వేష్. ఇప్పటికే నాగ్ అన్వేష్ హీరోగా వినవయ్యా రామయ్య, ఏంజెల్ సినిమాలు వచ్చాయి. ఇటీవల నాగ అన్వేష్ నిశితార్థం జరిగింది. నిన్న రాత్రి ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా జరిగింది. నాగ అన్వేష్ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉండొచ్చు??

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ కూతురు కావ్య, నాగ అన్వేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో వారికి చెప్పగా రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే ఇటీవలే ఈ జంట నిశితార్థం జరిగినట్టు తెలుస్తుంది. తాజాగా నిన్న రాత్రి ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో వైభవంగా జరగనుంది.