తెలుగు రాష్ట్రాలకు డార్లింగ్ సాయం.. మనసున్న మా ‘రాజు’ అంటూ అభినందిస్తున్న ఫ్యాన్స్..
కరోనా ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్..

కరోనా ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్..
కరోనా వైరస్ నిర్మూలన కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే సినీ ప్రముఖులు అంతా తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.
తాజాగా ప్రభాస్ రెండు రాష్ట్రాలకు తన వంతుగా రూ. కోటి ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందరూ సురక్షితంగా తమ ఇళ్ల వద్దనే ఉండాలని ప్రభాస్ ప్రజలను కోరారు.
ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న డార్లింగ్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ కోటి రూపాయల సహాయం ప్రకటించాడని తెలియగానే ‘డార్లింగ్ మనసున్న మా రాజు’ అంటూ అభినందిస్తున్నారు అభిమానులు..