Prasad Behara : యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్.. నటితో అసభ్యంగా ప్రవర్తించడంతో..
ఓ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్ ని అరెస్ట్ చేసారు.

Youtuber Prasad Behara Arrested with a Actress Complaint
Prasad Behara : యూట్యూబ్ లో పెళ్ళివారమండి వెబ్ సిరిస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహరా. ఇటీవల కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ వేసి మరింత వైరల్ అయ్యాడు. అయితే ఇటీవల ప్రసాద్ బెహరాపై ఓ నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్ ని అరెస్ట్ చేసారు.
ప్రసాద్ బెహరాతో పాటు పనిచేసే ఓ నటిని ప్రసాద్ షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకాడని, భూతులు తిట్టాడని, అందరి ముందు తనని తాకడంతో ప్రశ్నించగా జోక్ చేసాడని, అలాగే తనను బాడీ షేమింగ్ చేసాడని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఓ సారి ఇలాగే చేస్తే గట్టిగా ప్రశ్నించి తనతో కలిసి పని చేసే వెబ్ సిరీస్ నుంచి నటి తప్పుకోవడంతో ప్రసాద్ సారీ చెప్పాడని కానీ మళ్ళీ ఇలాగే చేయడంతో ఫిర్యాదు చేస్తున్నట్టు నటి పోలీసుల ఫిర్యాదులో తెలిపింది.
Also Read : Ponnam Prabhakar : డ్రగ్స్ కేసుల్లో సినీ ప్రముఖులు ఎంత పెద్దవారున్నా వదిలేది లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్..
నటి పోలీసులకు 14 వ తేదీనే కంప్లైంట్ చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే పోలీసులు ప్రసాద్ బెహరాని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించి 14 రోజులు రిమాండ్ లో ఉంచినట్టు తెలుస్తుంది.