Youtuber Sarayu: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైన సరయూ..

బిగ్‌బాస్ కంటెస్టెంట్.. యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది.

Youtuber Sarayu: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైన సరయూ..

Sarayu

Updated On : February 8, 2022 / 2:05 PM IST

Case on Youtuber Sarayu: బిగ్‌బాస్ కంటెస్టెంట్.. యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్‌గా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది.

సరయూతో పాటు షార్ట్ ఫిల్మ్ బృందంపై సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ కేసు విషయంలో బంజారాహిల్స్ పోలీసులకు వివరణ ఇచ్చారు సరయూ.

తన వీడియో లో ఉన్న కంటెంట్‌పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణ చెప్పేందుకు సిద్దమని ప్రకటించారు సరయూ. ఫిర్యాదు దరుడి డిమాండ్స్‌కి తలొగ్గి కంటెంట్‌ని తొలగించేందుకు సిద్ధమని ప్రకటించింది సరయూ టీమ్.

ఇప్పటికే అభ్యంతరకర వీడియోని ఎడిటింగ్ చేసేశామని, ఇంకా అభ్యంతరం అనుకుంటే వీడియోని డిలీట్ చేసేందుకు కూడా ఒప్పుకున్నారు. కాసేపట్లో సిరిసిల్ల నుంచి బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ చేరుకోనున్నారు పిటీషనర్ చేపురి అశోక్.

ఇరు పార్టీలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సరయూ ‘7 ఆర్ట్స్’ అనే యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తుంది. ఆ ఛానల్ రూపొందించిన అనేక షార్ట్ ఫిల్మ్స్ లో ఆమె కీలక పాత్ర పోషించింది.