Bigg Boss 5 : షణ్ముఖ్ ను రిజెక్ట్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం
వచ్చే నెల 5 నుంచి బిగ్ బాస్-5 తెలుగు రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

Bigg Boss 5
Bigg Boss 5 : వచ్చే నెల 5 నుంచి బిగ్ బాస్-5 తెలుగు రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక సెట్ ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. కంటెస్టెంట్స్ ఎంపిక తుదిదశకు చేరుకుంది. కంటెస్టెంట్స్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణి, నవ్యస్వామి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయమై కంటెస్టెంట్స్ కి నిర్వాహకులకు మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ షణ్ముఖ్ కోటి రూపాయల పారితోషకం అడిగినట్లుగా తెలుస్తుంది. అతడికి అంత ఇచ్చుకోలేమని బిగ్ బాస్ నిర్వాహకులు పక్కకు పెట్టినట్లు సమాచారం. బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్లలో షణ్ముఖ్ అత్యధిక పారితోషకం అడిగినట్లు సమాచారం.
ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. ఆయన యూట్యూబ్‌లో తన డ్యాన్స్‌లు, షార్ట్ ఫిల్మ్‌లతో చాలా పాపులారిటీని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో అతనిని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం అతని ఎంట్రీ బిగ్ బాస్‌లో ఉండదని అంటున్నారు.