వెంకీమామతో కలిసి నటించడం నా అదృష్టం : యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది..

  • Publish Date - December 11, 2019 / 08:55 AM IST

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకట్టగా.. బాబీ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘వెంకీ మామ’ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మీడియాతో ముచ్చటించారు.


‘‘కెమెరా ముందు ఒక మామయ్య, కెమెరా వెనక ఒక మామయ్య మంచి సపోర్ట్‌నిచ్చారు. ఈ షూటింగ్‌లో సినిమాకి సంబంధించిన ఏదో ఒక యాస్పెక్ట్‌లో కొత్త విషయాన్ని సురేష్‌ మావయ్య దగ్గర నేర్చుకున్నాను’’.


‘‘వెంకీమామ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా పర్సన్‌గా ఆయన ఆన్‌సెట్‌ ఎలా బిహేవ్‌ చేస్తారు. ఎలా కామ్‌గా, పాజిటివ్‌గా ఉంటారు అనేది అబ్జర్వ్‌ చేశాను. చాలామంది అంటుంటారు వెంకటేష్‌గారికి నో హేటర్స్‌. నో నెగిటివిటీ అని. ఆయన్ని అబ్జర్వ్‌ చేశాక ఆయన్ని ఎందుకు అలా అంటారు అనేది నాకు అర్థమైంది. ఆయనతో చేయడం ఏ యాక్టర్‌కైనా బ్లెస్సింగ్‌. ఎమోషనల్‌ సీన్లలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌ ఇవన్నీ ఆయనతో నటించే ఎవరికైనా ప్లస్సే’’.

‘‘నిజం చెప్పాలంటే రియల్‌ లైఫ్‌లో మేమిద్దరం చాలా క్వైట్‌. సైలెన్స్‌లోనే ఒక బాండింగ్‌, ఎటాచ్‌మెంట్‌ ఉంటుంది. కానీ సినిమాలో ఎక్కువ డైలాగులు చెప్పడం, హై ఎమోషన్స్‌లాంటివి చేశాం. మొదటివారం ఎడాప్ట్‌ అవ్వడానికి కొంచెం టైమ్‌ పట్టింది. ఎందుకంటే చెన్నై నుండి కూడా మా ఇద్దరి రియల్‌ లైఫ్‌లో జెన్యూన్‌ బాండింగ్‌ ఉంది. నా చిన్నప్పట్నుంచీ ఆయన నన్ను అబ్జర్వ్‌ చేస్తూనే ఉన్నారు కాబట్టి సెట్లో అలా చేయడం కొత్తగా అనిపించేది. రేపు సినిమా చూశాక ఆడియన్స్‌ కూడా ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కూడా రియల్‌ బాండింగ్‌ ఉంది అనేంతలా ఫీలవుతారు. ఈ స్క్రిప్ట్‌కి అది బోనస్‌’’.


‘‘నేను యాక్టింగ్‌ మొదలు పెట్టినప్పట్నుంచీ వెంకీమామతో, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నటించాలనే ఆలోచన ఉంది. అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ వచ్చాక ఆటోమేటిగ్గా అదే సెట్‌ అవుద్ది అనుకున్నాను. 2019లో ఎలాంటి ప్లానింగ్‌ లేకుండానే ఈ రెండూ కలిసొచ్చాయి. ఈ కథ భీమవరంలో స్టార్ట్‌ అయి కశ్మీర్‌లో ఎండ్‌ అవుతుంది. ముందు కథలో ఈ స్పాన్‌ లేదు. సురేష్‌గారు, వెంకటేష్‌గారు బాబీతో కూర్చుని డిజైన్‌ చేసిన స్ట్రక్చర్‌ అది. నా కెరీర్‌కి ది బెస్ట్‌ మూవీ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇవ్వాలనే కథని అలా డిజైన్‌ చేశారు. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కి పెద్ద ప్లస్‌ అవుతుంది’’.