Blockbuster Bonalu: గెట్ రెడీ.. జీ తెలుగు బోనాల సంబురం.. ‘బ్లాక్‌బస్టర్ బోనాలు’.. ఈ ఆదివారం సా.6 గంటలకు..

రోజా.. చిరంజీవి శంకర్ దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు.

Blockbuster Bonalu: గెట్ రెడీ.. జీ తెలుగు బోనాల సంబురం.. ‘బ్లాక్‌బస్టర్ బోనాలు’.. ఈ ఆదివారం సా.6 గంటలకు..

Updated On : July 18, 2025 / 6:57 PM IST

Blockbuster Bonalu: బోనాల సందర్భంగా మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు రానుంది జీ తెలుగు. తెలంగాణ బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ‘బ్లాక్ బస్టర్ బోనాలు’ ఆదివారం (జూలై 20న) సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. జీ తెలుగు నటీనటుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగనుంది. రవి, వర్షిణి యాంకర్లు.

ఈ కార్యక్రమం సంప్రదాయం, సంస్కృతి మేళవింపు. కళాకారుల ప్రదర్శనలు, హాస్య సన్నివేశాలు, వినోదాత్మక స్కిట్లు, మధురమైన పాటలతో పాటు మరెన్నో వినోదం పంచే కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. హీరో శ్రీకాంత్‌‌‌‌ – నటి రోజా నాయకత్వంలో రెండు టీమ్స్ ఏర్పడి పోటీపడనున్నారు. జోగిని శ్యామల దేవత ఎల్లమ్మ కథను ఆవిష్కరించనున్నారు.

“హగ్ చేస్కో, సాంగ్ గెస్ చేస్కో” అనే ఆటతో అంత్యాక్షరి ఆట ఉంటుంది. శ్రీకాంత్ తన సూపర్ హిట్ సినిమా “ప్రేయసిరావే” లోని గాజులు విసిరే సన్నివేశాన్ని పునఃసృష్టించనున్నారు. డ్రామా జూనియర్స్ పిల్లలు బాలకృష్ణ “అఖండ” పాత్రను అనుకరించి కడుపుబ్బా నవ్వించనున్నారు.

Also Read: 2025లో ఎక్కువ ప్రాఫిట్ చూసిన సినిమా ఇదే.. వివాదంతో పాటు 1200 శాతం లాభాలు.. ఏ తెలుగు సినిమా దరిదాపుల్లో లేదుగా..

రోజా చిరంజీవి శంకర్ దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు. ప్రైమ్‌టైమ్ హీరోయిన్ల మధ్య నృత్య పోటీ ఉంటుంది. చిన్నారులు రాయన్, కుషి తమ పాటలు పాడనున్నారు. బోనాలు సందర్భంగా మహిళా కళాకారులకు గాజులు పంచడం తెలంగాణ సంప్రదాయం. వినోదభరితమైన బ్లాక్‌బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో తప్పక చూడండి.