Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?

ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వినూత్నమైన ప్రోగ్రామ్స్, ఆకట్టుకునే సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ మిగతా టీవీ ఛానల్స్‌కు పోటీగా ముందు వరుసలో....

Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?

Zee Telugu To Hold Auditions For Dance India Dance Show

Updated On : June 27, 2022 / 5:16 PM IST

Zee Telugu: ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వినూత్నమైన ప్రోగ్రామ్స్, ఆకట్టుకునే సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ మిగతా టీవీ ఛానల్స్‌కు పోటీగా ముందు వరుసలో దూసుకుపోతుంది. ఇక రియాలిటీ షోలతో తనదైన మార్క్ వేసుకున్న జీ తెలుగు, తాజాగా మరో కొత్త షోకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే జీ నెట్‌వర్క్‌లోని ఇతర భాషల్లో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ డ్యాన్స్ షోతో సరికొత్త ట్యాలెంట్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇప్పుడు ఈ అవకాశం తెలుగు ప్రజలకు అందించేందుకు జీ తెలుగు రెడీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు ఈ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు జీ తెలుగు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారిని తాము నిర్వహించే ఆడిషన్స్‌కు హాజరు కావాల్సిందిగా జీ తెలుగు ప్రకటించింది. ఇప్పటికే మొదలైన ఈ ఆడిషన్స్, వరంగల్, ఖమ్మం, కర్నూల్, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌లో జరగగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కిందని జీ తెలుగు నిర్వాహకులు అంటున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ డ్యాన్స్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు జీ తెలుగు నెట్‌వర్క్ తెలిపింది.

జూలై 3న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య వయసుగల వారు, డ్యాన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు తమ ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది జీ తెలుగు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు జీ తెలుగు ఈ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో నిర్వహిస్తున్నట్లు ఛానల్ నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ డ్యాన్స్ షోలో పాల్గొనాలని అనుకునే వారు డిజిటల్ ఆడిషన్స్‌ కూడా ఇవ్వచ్చు. వారు డ్యాన్స్ చేసిన వీడియోలను 9154984009 నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని.. did.zeetelugu@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చని.. లేదా didtelugu.zee5.com వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వీడియోలను పంపవచ్చని నిర్వాహకులు ప్రకటించారు.