ఈ 10 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వండి : CIABC

కరోనా వైరస్ వ్యాధి ( Covid-19) వ్యాపిస్తుందనే భయంతో కొందరు ఆకతాయిలు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి చాలామంది Bootleg alcohol మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రచారం కారణంగా విషపూరిత ఆల్కాహాల్ సేవిస్తే.. తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. Bootleg alcohol మద్యం కోసం మందుబాబులు ఎగబడుతున్న పరిస్థితుల్లో అపెక్స్ బాడీ లిక్కర్ డీలర్స్ రాష్ట్రాలకు ఒక సూచన చేసింది. మహమ్మారిపై పోరాటడానికి రాష్ట్రాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించవచ్చునని సూచించింది. (కిక్కు కోసం, నిద్రమాత్రలు మింగిన సీనియర్ నటి కుమారుడు)
Confederation of Indian Alcoholic Beverage Companies (CIABC) మద్య పానీయాల అమ్మకాన్ని అనుమతించాలని 10 రాష్ట్రాలను కోరింది. కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ సమయంలో మద్య పానీయాల అమ్మకాలపై నిషేధం విధించడంతో కొన్నిచోట్ల అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఈ లాక్ డౌన్ సమయంలో అక్రమ, నకిలీ మద్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది.
ఈ మేరకు CIABCకు చెందిన అపెక్స్ బాడీ.. Indian alcoholic beverage industry మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు సోమవారం లేఖలు పంపింది. బూట్లెగ్డ్ మద్యం అమ్మకంపై చాలా రిపోర్టులు వచ్చాయని, నకిలీ మద్యాన్ని సేవించడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని, శాంతిభద్రతల పరిస్థితులను ప్రతికూలతలను సృష్టించే ప్రమాదం ఉందని CIABC డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి లేఖలో పేర్కొన్నారు. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మద్యం లైసెన్సులు, ఏప్రిల్ 30 వరకు ఆమోదాలు లేదా లాక్ డౌన్ తర్వాత అదనంగా నెల వరకు పొడిగించాలని CIABC అభ్యర్థించింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం చాలా ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. రిటైల్ దుకాణాలను మూసివేయడం ద్వారా, కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి డబ్బు వినియోగించాల్సి ఉంటుంది. కొంతమందికి వైద్య కారణాల వల్ల మద్యం అవసరమని ఆయన అన్నారు. భారతదేశంలో, విదేశాలలో తమ ఉత్పత్తులను తయారు చేసి, మార్కెట్ చేసే చాలా పెద్ద భారతీయ కంపెనీలను కలిగి ఉన్న CIABC.. రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక దూర నిబంధనలను ఖచ్చితంగా పాటించటానికి మద్యం షాపుల సమయాలను తగ్గించడం, అవుట్‌లెట్లను నిర్దేశించడం వంటి అవసరమైన నియంత్రణ చర్యలను అమలు చేయాలని సూచించింది.