Omicron Cases In India : దేశంలో 101 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..కేంద్రం కీలక సూచనలు

కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాల‌కు విస్త‌రించిన ఈ వేరియంట్ మ‌న దేశాన్ని కూడా

Omicron Cases In India :  కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాల‌కు విస్త‌రించిన ఈ వేరియంట్ మ‌న దేశాన్ని కూడా టెన్షన్ పెడుతోంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ల‌వ్ అగ‌ర్వాల్ శుక్రవారం ప్రకటించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 101 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. మ‌హా రాష్ట్ర లో 32 కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజ‌స్థాన్‌లో 17 కేసులు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రల‌ లో 8 కేసులు,ఏపీలో 2 కేసులు న‌మోదు అయిన‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ ప్రకటించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యం లో.. ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయన కోరారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అంద‌రూ మాస్కులు ధ‌రించాల‌ని కోరారు. అనవసరపు ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

ALSO READ Tamil Nadu: స్కూల్ టాయిలెట్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి

 

ట్రెండింగ్ వార్తలు