Mayors’ Conference : దేశానికి విప్లవం కాదు వికాసం కావాలి..కాశీ అభివృద్ధి ఓ దిక్సూచీ

ఉత్తరప్రదేశ్ లోని వార‌ణాసిలో శుక్ర‌వారం అఖిల భార‌త మేయ‌ర్ల స‌ద‌స్సును ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన

Mayors’ Conference : దేశానికి విప్లవం కాదు వికాసం కావాలి..కాశీ అభివృద్ధి ఓ దిక్సూచీ

Modi (4)

Mayors’ Conference : ఉత్తరప్రదేశ్ లోని వార‌ణాసిలో శుక్ర‌వారం అఖిల భార‌త మేయ‌ర్ల స‌ద‌స్సును ప్ర‌ధాని మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ స‌ద‌స్సులో పాల్గొన్న మేయ‌ర్లు త‌మ న‌గ‌రాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవ‌కాశాన్నీ జార‌విడుచుకోర‌నే విశ్వాసం త‌న‌కున్న‌ద‌ని అన్నారు. మ‌నం మ‌న చారిత్రక వార‌సత్వ క‌ట్ట‌డాల‌కు పున‌రుత్తేజం క‌ల్పించాల‌ని అన్నారు.

కాశీలో జ‌రిగిన అభివృద్ధి దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌కు రోడ్‌మ్యాప్ వంటిద‌ని మోదీ అన్నారు. మ‌న దేశంలో చాలా న‌గ‌రాలు సంప్ర‌దాయ న‌గరాల‌ని వాటి అభివృద్ధి కూడా ఇదే త‌ర‌హాలో చేప‌ట్టాల‌ని అన్నారు. ఆయా న‌గ‌రాల్లోని స్ధానిక నైపుణ్యాలు, ఉత్ప‌త్తుల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డం నేర్చుకోవాల‌ని సూచించారు.

ప్రస్తుతం భారత్​కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదని మోదీ అన్నారు. స్వచ్ఛత అభియాన్​ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన నగరాలతో పాటు అందుకు కృషి చేసిన ఇతర ప్రాంతాలనూ గుర్తించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురికి మోదీ సూచించారు.

కాగా,మేయ‌ర్ల స‌దస్సులో ప్రారంభోప‌న్యాసం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్.. గ‌త ఏడేండ్లుగా అభివృద్ధిలో కాశీ కొత్త‌పుంత‌లు తొక్కుతోంద‌ని చెప్పుకొచ్చారు. కాశీ ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే పురాతన న‌గ‌రాన్ని కొత్త రూపంలో ప్ర‌పంచం ముందు ఆవిష్క‌రించామ‌న్నారు.

ALSO READ Varun Singh : వీరుడా వందనం..గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కు తుది వీడ్కోలు