Black fever in Bengal : బెంగాల్లో ‘బ్లాక్ ఫీవర్’ కలవరం..11 జిల్లాల్లో 65 కేసులు నమోదు

పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు నమోదు అయ్యాయి.

Black fever in Bengal : బెంగాల్లో ‘బ్లాక్ ఫీవర్’ కలవరం..11 జిల్లాల్లో 65 కేసులు నమోదు

Bengal Districts Report Cases Of Black Fever

Updated On : July 16, 2022 / 3:37 PM IST

Bengal 11 districts report cases of black fever : పశ్చిమబెంగాల్ ప్రజలు బ్లాక్ ఫీవర్ తో జనాలు హడలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలలో 65 బ్లాక్ ఫీవర్ (కాలా అజార్) కేసులు నమోదు అయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే 65 కేసులు నమోదు కావటంతో బ్లాక్ ఫీవర్ పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా డార్జిలింగ్, మాల్డా, ఉత్తర్ దినాజ్ పూర్, దక్షిణ్ దినాజ్ పూర్, కలింపోంగ్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

‘‘వాస్తవానికి కాలా అజార్ ను పశ్చిమబెంగాల్ లో నిర్మూలించేశాము. కానీ.. ఇటీవల నిఘా పెట్టడంతో 11 జిల్లాల్లో 65 కేసులు నమోదు కావటంతో దీన్ని మరోసారి నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీర్భూమ్, బంకురా, పురూలియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో బ్లాక్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయని ఇది ప్రధానంగా పరాన్నజీవి లీష్మానియా డోనోవానీ సోకిన సాండ్ ఈగలు (sandflies)కాటు ద్వారా వ్యాపిస్తుందని కానీ కోల్ కతాలో ఇప్పటి వరకు ఇటువంటి కేసులు ఏవీ నమోదు కాలేదని తెలిపారు.

ఎక్కువ రోజుల పాటు బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో ఉండి వచ్చిన వారిలోనే ఈ జ్వరం బయటపడుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన కొందరు వ్యక్తుల్లోనూ ఈ లక్షణాలు ఉన్నాయి’’ అని ఓ అధికారి తెలిపారు. బ్లాక్ ఫీవర్ ఫియర్ పరిణామాలతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలా అజార్ తో ఎవరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా తాము పూర్తిగా భరిస్తామని రాష్ట్ర యంత్రాంగం స్పష్టం చేసింది.

“ప్రైవేట్ లేబొరేటరీ లేదా ఆసుపత్రిలో ఈ ఫీవర్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్ గుర్తిస్తే వెంటనే జిల్లా ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధితులకు భోజనంతో పాటు అన్ని చికిత్స ఖర్చులు రాష్ట్ర ఆరోగ్య శాఖ భరిస్తుందని స్పష్టంచేశారు. రోగులకు పౌష్టికాహారం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.