Sharad Pawar: శరద్ పవార్ ఇంటిపై దాడి ఘటనలో లాయర్ సహా 110 మంది అరెస్ట్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిపై శనివారం చెప్పులు, కర్రలు, రాళ్లు విసిరిన ఘటనలో 110 మంది ఎంఎస్ఆర్టిసి కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు

Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిపై శనివారం చెప్పులు, కర్రలు, రాళ్లు విసిరిన ఘటనలో 110 మంది ఎంఎస్ఆర్టిసి కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ఉసిగొల్పారన్నా ఆరోపణలపై న్యాయవాది గుణరత్న సదావర్తేను సహా మొత్తం 110 మంది నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో 109 మందిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, సదావర్తేను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం నలుగురు వ్యక్తులు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ప్రదీప్ ఘరత్ ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సదావర్తే కస్టడీకి కోరుతూ ఘరత్ కోర్టుకు విన్నవించుకున్నారు.

Also read:Bihar : విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి, ప్రేమే కారణమా

న్యాయవాది సదావర్తే అల్లరి మూకను రెచ్చగొట్టారని పేర్కొన్న ఘరత్, తాను వీడియో ఫుటేజీని కూడా కోర్టుకు సమర్పిస్తానని చెప్పారు. ఇక ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారి ఒకరు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దక్షిణ ముంబై నివాసం వెలుపల శుక్రవారం నిరసనకు పాల్పడిన నిందితుల్లో 100 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొదట 104 మందిని అరెస్టు చేసామని..ఆ తర్వాత మరో ఆరుగురిని అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. వారిలో నలుగురు నిందితులు దక్షిణ ముంబైలోని సిల్వర్ ఓక్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read:Covid Vaccine Booster: నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు: రూ.225కే ఇవ్వాలని కేంద్రం ఆదేశం

అరెస్ట్ చేసిన నిందితుల్లో 87 మంది మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ఆమేరకు నిందితుల రక్తనమూనాలను సేకరించారు. అరెస్టయిన వారిలో 87 మంది పురుషులు, 23 మంది మహిళలు ఉన్నారు. నిందితుల మొబైల్ ఫోన్లలో కొన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. మొత్తం 110 మంది నిందితులను పోలీసు వ్యాన్లలో సిఎస్టి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ప్లానేడ్ కోర్టుకు తీసుకువచ్చారు. పవార్ నివాసం వద్ద ఎంఎస్ఆర్టిసి సిబ్బంది చేసిన దాడి ఘటనపై శుక్రవారం సాయంత్రమే ముంబైలోని గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిరసన సమయంలో అడ్డుకున్న ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడినట్లు కూడా సమాచారం.

Also read:Paddy Issue : హస్తినకు గులాబీ దండు.. తెలంగాణ భవన్ వద్ద దీక్ష

ట్రెండింగ్ వార్తలు