Minor Mother: పెళ్లికాకుండా 17 ఏళ్లకే తల్లి అయిన బాలిక, 12 ఏళ్ల బాలుడే కారణం?

పెళ్లికాకుండానే 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈఘటన తమిళనాడులోని తంజావూరులో ఏప్రిల్ రెండో వారంలో చోటుచేసుకోగా

Tanjavur

Minor Mother: కౌమార దశలో ఆడుతూపాడుతూ జీవితానికి మంచి బాటలు వేసుకోవాల్సిన సమయంలో..ఓ మైనర్ బాలిక జీవితం గాడితప్పింది. 12 ఏళ్ల బాలుడి చేతిలో అత్యాచారానికి గురైన ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈఘటన తమిళనాడులోని తంజావూరులో ఏప్రిల్ రెండో వారంలో చోటుచేసుకోగా..పోలీస్ కేసు నమోదుతో ఇటీవల వెలుగులోకి వచ్చింది. పోలీసుల కధనం ప్రకారం..పెళ్లికాకుండానే 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈక్రమంలో గత కొన్ని నెలలుగా పాఠశాలకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. తల్లిదండ్రులు ప్రశ్నించగా..తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పుకొచ్చింది.

Also read:Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది

అయితే ఏప్రిల్ 17న తీవ్ర కడుపు నోపితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా..వైద్యులు పరీక్షించి ఆమె నిండు చూలాలుగా గుర్తించారు. అనూహ్యంగా అదే రోజు సాయంత్రం బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లికాకుండానే బాలిక బిడ్డకు జన్మనివ్వడంపై తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. బాలిక నుంచి వివరాలు సేకరించిన తల్లిదండ్రులు..అసలు విషయం తెలుసుకుని హతాశులయ్యారు. తమ్ ఇంటి వద్దనే ఉంటున్న 12 ఏళ్ల బాలుడే అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

Also read:Kidnap In Narasaraopet : నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం.. జువెలరీ షాపులో పని చేసే వ్యక్తి అపహరణ

అయితే బాలిక చెప్పిన వివరాలపై పోలీసులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల బాలుడి కారణంగా గర్భం దాల్చే అవకాశం ఉందా? లేక బాలిక ఏవైనా విషయాలు దాస్తోందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం బాలుడిని బాల నేరస్థుల పాఠశాలకు తరలించారు. కోర్టు నుంచి, సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుని బాలుడిపై వైద్య పరీక్షలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Also read:Bank Manager Suicide : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక బ్యాంక్ మేనేజర్‌ ఆత్మహత్య