కళ్యాణ వైభోగం : 15 మంది ట్రాన్స్‌జెండర్ల వివాహం

  • Publish Date - March 31, 2019 / 06:41 AM IST

వివాహం చేసుకోవడం తప్పా..మేము పెళ్లి చేసుకుంటామంటున్నారు ట్రాన్స్‌జెండర్లు. తాము పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడమే కాదు..తమకు ఒక మనస్సు ఉంటుందంటున్నారు. 15 మంది ట్రాన్స్‌జెండర్ల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్‌లో వీరి పెళ్లి వేడుకలు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సామూహిక వివాహాలను చిత్రగాహి సినిమా నిర్మాత సొంత ఖర్చుతో జరిపించారు. సామాజిక కార్యకర్త విద్యా రాజ్ పుత్‌తో పాటు ఇతరులు వేడుకల ఏర్పాట్లు చేశారు. 
Read Also : ‘నాసా’ బంపర్ ఆఫర్ : ‘నిద్ర’ ప్రియులకు లక్షలిస్తాం

పూజారి పార్క్ మ్యారేజ్ ప్యాలెస్‌లో జరిగిన వివాహాలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగాయి. అనంతరం ట్రాన్స్ జెండర్లను అంబేడ్కర్ భవన్ నుంచి సివిల్ లైన్స్ వరకు ఊరేగించారు. 15 మంది ట్రాన్స్‌జెండర్ మహిళల్లో ఏడుగురు ఛత్తీస్‌గఢ్‌, ఇద్దరు గుజరాత్, మరో ఇద్దరు మధ్యప్రదేశ్, ఒకరు బీహార్, మరొకరు మహారాష్ట్ర , పశ్చిమబెంగాల్‌కు చెందిన మరొకరున్నారు. 
వివాహం చేసుకున్న వారిలో సలోని – గులామ్ నబీ కూడా ఉన్నారు. వీరి ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. అంతేకాదు..సభ్యసమాజం చిన్న చూపు చూసింది. ఇది వారికి నచ్చలేదు. చివరకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సలోని మెడలో గులాం తాళి కట్టాడు. తాము ఒక్కటి కావాలని బలంగా కోరుకున్నట్లు..అది ఇప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందని సలోని పేర్కొంది. 
Read Also : యజమానికే ఝలక్: ఫేస్‌బుక్‌లో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పోస్ట్‌లనే తీసేశారు

ట్రాన్స్ జెండర్స్‌ను థర్డ్ జెండర్ క్యాటగిరీగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2014లో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వారిని ఓబీసీ కోటాలో చేర్చాలనీ ఆదేశించింది. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీలో కొత్త ఆశలు చిగురించాయి. వారికి రాజ్యాంగం కల్పించే అన్ని హక్కులూ వర్తిస్తాయని పేర్కొంది. లెస్బియన్‌-గే-బైసెక్సువల్‌-ట్రాన్స్‌జెండర్‌ (ఎల్జీబీటీ)లకూ ఇతర పౌరుల్లాగే సమానహక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ