Birbhum BJP Workers : శానిటైజర్ లో శుద్ధి చేసుకుని మరీ టీఎంసీలో చేరిన బీజేపీ కార్యకర్తలు

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి.

Birbhum BJP Workers : శానిటైజర్ లో శుద్ధి చేసుకుని మరీ టీఎంసీలో చేరిన బీజేపీ కార్యకర్తలు

Bengal

Updated On : June 24, 2021 / 10:05 PM IST

Birbhum BJP Workers పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి. వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరుతున్నారు. బీర్భూమ్ జిల్లాలో గురువారం సుమారు 150 మంది బీజేపీ కార్యకర్తలు టీఎంసీలో చేరారు.

అయితే టీఎంసీలో చేరడానికి ముందు బీజేపీ వైరస్ నుంచి తమను తాము కాపాడుకుంటున్నామంటూ శానిటైజర్ తో శుద్ధి చేయించుకున్నారు. మాలో బీజేపీ వైరస్ ఉందని, దాన్ని తొలగించుకోవాలంటే ఇలా శానిటైజర్ శుద్ధి అవసరమని కొందరు వ్యాఖ్యానించారు. బీజేపీ బగ్ నుంచి వీరిని ప్రక్షాళన చేశామని తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. బీర్భూమ్ లోని ఇలమ్ బజార్ బ్లాక్ లో జరిగిన ఈ శానిటైజేషన్ శుద్ధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈ నెల 22న హుగ్లీ జిల్లాలో కూడా దాదాపు 200 మంది బీజేపీ కార్యకర్తలు శిరోముండనం చేయించుకుని.. గంగాజలంతో తమను తాము శుద్ధి చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీలో చేరి తాము పెద్ద తప్పు చేశామని, ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామని వారు చెప్పారు. Birbhum