అర్థరాత్రి సింహాల ఫారెస్టులోకి జర్నలిస్టులు: ఏం చేశారంటే..

అర్థరాత్రి సింహాల అడవిలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. నానా హంగామా సృష్టించారు. టార్చ్ లైట్లు..కెమెరాలతోను హల్ చల్ చేశారు. వీడియోలు తీస్తూ..నానా హంగామా చేశారు. కటిక చీకట్లో ఒక్కసారిగా లైట్లు పడేసరికి సింహాలు ఉలిక్కిపడ్డాయి. సింహం పిల్లలు బెదిరిపోయాయి. ఈ ఘటన గురజరాత్ లోని గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో శుక్రవారం (ఆగస్టు 23)అర్థరాత్రి చోటుచేసుకుంది.
గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిషేధిత స్థలంలోకి అర్థరాత్రి సమయంలో ఇద్దరు జర్నలిస్టులతో సహా మరో నలుగురు ప్రవేశించి..వీడియోలు తీస్తూన్న మొత్తం ఆరుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గిర్ ఫారెస్ట్‌లో సింహాలున్న ప్రాంతంలోకి టార్చ్‌లైట్లు..వీడియో కెమెరాలతో అక్రమంగా ప్రవేశించిన వీరు సింహాల ముఖాలపై టార్చ్‌లైట్లను వెస్తూ.. వాటిని వీడియో తీశారు. ఇది గమనించిన ఫారెస్ట్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో జర్నలిస్టులు హిరెన్ ధాకన్, ధర్మేష్ ఖాచర్ తో పాటు బాలక్దాస్ దేవ్మురారి, నట్వర్ భువా, నితిన్ రయానీ,దయా పోలా ధినోయా అనే స్థానికులుగా అధికారులు గుర్తించారు.
అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి సింహాలకు ఇబ్బంది కలిగించటం నేరమనీ..ఇద్దరు జర్నలిస్టులతో సహా మొత్తం ఆరుగురిపై విల్డ్‌లైఫ్ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు గిర్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ధీరజ్ మిట్టల్ తెలిపారు.