2020-21 బడ్జెట్..పీఎం కుసుమ్ ప‌థ‌కంతో 20 ల‌క్ష‌ల రైతుల‌కు సోలార్ పంపులు

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 06:35 AM IST
2020-21 బడ్జెట్..పీఎం కుసుమ్ ప‌థ‌కంతో 20 ల‌క్ష‌ల రైతుల‌కు సోలార్ పంపులు

Updated On : February 1, 2020 / 6:35 AM IST

పీఎం కుసుమ్ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకు సోలాప్ పంపులు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 2020-21 బడ్జెట్ ను లోక్‌స‌భ‌ పెట్టిన మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సంకల్పించుకుందనీ దానికి ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని  మంత్రి నిర్మ‌లా స్పష్టంచేశారు. ఇది  2022 క‌ల్లా నెరవేరుస్తామని తెలిపారు. 

దీంట్లో భాగంగా..నీటి ఎద్ద‌డి ఉన్న జిల్లాల్లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక అమ‌లు చేస్తామనీ..సోలార్ పంపుల‌ను ఏర్పాటు చేసుకునేందుకు సుమారు 20 ల‌క్ష‌ల రైతుల‌కు పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ ఉర్జా సుర‌క్షా ఈవ‌మ్ ఉత్త‌న్ మ‌హాభియాన్ ప‌థ‌కాన్ని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌జ‌ల ఆదాయాన్ని పెంచ‌ుతామనీ..దానికి సంబధించిన చర్యలు తీసుకంటున్నామని తెలిపారు. ఆదాయం పెరిగితే ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి కూడా పెర‌గ‌ుతుందన్నారు. దీంతో భారత్ తో ఉత్పత్తి రంగం కూడా పెరుగుతుందని తద్వారా భారత ఆర్థికాభివృద్ధి మరింతగా పెరుగతుందని అన్నారు.  

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల మార్కెట్ల‌ను మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేయ‌నున్నామనీ..వ్య‌వ‌సాయంలో మ‌రింత పోటీత‌త్వం పెర‌గాల‌న్నారు. స‌మ‌గ్ర‌మైన పంట విధానాల‌ను వ‌లంబించాల‌న్నారు. వ్య‌వ‌సాయంలో కొత్త టెక్నాల‌జీ కూడా అవ‌స‌ర‌మ‌న్నారు.  మోడ‌ల్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసే రాష్ట్రాల‌ను మ‌రింత ప్రోత్స‌హించినున్న‌ట్లు మంత్రి తెలిపారు.