Ather Energy Electric Scooter: ఏథర్ ఎనర్జీ నుండి 450ఎక్స్ మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ప్రీమియం స్కూటర్ 450X మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంగళవారం విడుదల చేసింది. ఏథర్ ఎనర్జీ విడుదల చేసిన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ఖరీదైనదే. అయితే గతంలో ఫీచర్స్ కంటే అదనపు ఫీచర్లను కల్పించింది. పెద్ద బ్యాటరీ, మెరుగైన UIతో మరింత సామర్థ్యం గల డిజిటల్ డాష్‌బోర్డ్ వంటి అదనపు ఫీచర్లను కూడా అందిస్తుంది.

Ather 450x
Ather Energy Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ప్రీమియం స్కూటర్ 450X మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంగళవారం విడుదల చేసింది. ‘450X Gen 3′ ఏథర్ 450 ప్లాట్‌ఫారమ్ యొక్క మూడవ తరం ఆధారంగా ఈ స్కూటర్ ను రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం నెలకు లక్ష యూనిట్లు విక్రయాలు దాటుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. 30శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Electric Vehicles : షాకింగ్ న్యూస్, ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?
ఇదిలాఉంటే.. ఏథర్ ఎనర్జీ విడుదల చేసిన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ఖరీదైనదే. అయితే దీనిలో గతంలో మోడల్స్ కంటే అదనపు ఫీచర్లను కల్పించింది. పెద్ద బ్యాటరీ, మెరుగైన UIతో మరింత సామర్థ్యం గల డిజిటల్ డాష్‌బోర్డ్ వంటి అదనపు ఫీచర్లను కూడా అందిస్తుంది. అయితే ధీని ధరకు రూ. 1.37లక్షలు (ఎక్స్- షోరూమ్) గా నిర్ణయిచింది. 450 ప్లాట్‌ఫారమ్ యొక్క మొదటి తరం 2018లో ప్రారంభించబడింది, దాని తర్వాత రెండవ తరం 2020లో ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా మాట్లాడుతూ.. మేము ఉత్పత్తి బ్రాండింగ్ ను అలాగే ఉంచుతున్నామని, కానీ అంతర్గతంగా, ఇంజనీరింగ్, హార్డ్ వేర్, స్పెక్స్ గణనీయంగా మారాయని తెలిపారు. నూతనంగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో అతిపెద్ద మార్పు బ్యాటరీ ప్యాక్ అని, దాదాపు గతం వాటితో పోల్చితే 25శాతం పెద్దదిగా ఉంటుందని, 2.9కిలో వాట్ గంటల నుంచి 3.7 కిలో వాట్ గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ARAI- ధృవీకరించబడిన పరిధి 116 కి.మీ నుండి 146 కి.మీలకు పెరిగింది. అయితే నగర పరిస్థితులలో వినియోగదారులకు లభించే నిజమైన పరిధి కూడా 85 నుండి దాదాపు 105 కి.మీలకు పెరిగింది. చాలా మంది కస్టమర్‌లు, ముఖ్యంగా మొదటి సారి ఎలక్ట్రిక్ వాహనాలు(EV) కొనుగోలుదారులు 100 కి.మీల అవరోధాన్ని దాటాలని కోరుకుంటున్నారని మెహతా తెలిపారు. అంతేకాక కొత్త 450X బ్యాటరీ ప్యాక్ యొక్క మెరుగైన థర్మల్ పనితీరును కలిగి ఉందని, తద్వారా ఎక్కువ సమయం పాటు పెర్ఫార్మెన్స్ రైడింగ్‌కు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. 450X Gen 3 విశాలమైన వెనుక టైర్‌లతో కూడా వస్తుందని, ఇవి మలుపులు వద్ద బ్రేక్ వేసిన వెంటనే నిలిచిపోతాయని, మెరుగైన గ్రిప్ ను కలిగి ఉంటాయని తెలిపారు.
మరోవైపు 450X Gen 3 ఐదు రైడ్ మోడ్‌లను అందిస్తుందని.. Warp, Sport, Ride, SmartEco, Eco 6.2 kW వద్ద వార్ప్ మోడ్‌లో గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో అందించబడుతుందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)తో పాటు అప్‌గ్రేడ్ చేసిన 2 GB RAMతో అప్‌గ్రేడ్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ కూడా ఉందని నిర్వాహకులు తెలిపారు.