గోవా హాస్పిటల్ లో 4 గంటల్లో 26 కరోనా పేషెంట్లు మృతి

గోవాలో క‌రోనా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.

గోవా హాస్పిటల్ లో 4 గంటల్లో 26 కరోనా పేషెంట్లు మృతి

26 Covid Patients

Updated On : May 11, 2021 / 9:27 PM IST

26 Covid Patients గోవాలో క‌రోనా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రాజధాని పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో మంగళవారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల నుంచి 6 గంట‌ల మ‌ధ్య‌లో 26 మంది క‌రోనా రోగులు చ‌నిపోయిన‌ట్లు ఆ రాష్‌ర్ట ఆరోగ్య మంత్రి విశ్వ‌జిత్ రాణే తెలిపారు. అయితే క‌రోనా రోగులు మ‌ర‌ణించ‌డానికి గ‌ల కారణాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.ఆక్సిజన్ లభ్యత, జీఎంసీహెచ్‌లోని కోవిడ్-19 వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఆటంకం ఏర్పడటం వల్ల రోగులకు కొన్ని సమస్యలు తలెత్తి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

గోవాలో ఆక్సిజన్ కొరత లేదని, అయితే కొన్ని సమయాల్లో సిలిండర్లు సమయానికి చేరుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని విశ్వజీత్‌ రాణే తెలిపారు. ఈ ఘటనపై హైకోర్టు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమ‌వారం గోవాలో 1200 జంబో సిలిండ‌ర్ల ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైన‌ప్ప‌టికీ 400 మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేశార‌ని తెలిపారు.

ఇక, గోవా మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిని సీఎం ప్రమోద్ సావంత్ మంగ‌ళ‌వారం సంద‌ర్శించి, క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు. వైద్య సేవ‌లు ఎలా ఉన్నాయ‌ని రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. గోవా మెడిక‌ల్ కాలేజీలో వార్డుల వారీగా ఆక్సిజ‌న్‌ను అందించే మెకానిజ‌మ్‌పై చ‌ర్చిస్తామ‌ని సీఎం తెలిపారు. గోవా మెడిక‌ల్ కాలేజీలో కొన‌సాగుతున్న క‌రోనా ట్రీట్‌మెంట్‌పై విచార‌ణ చేసేందుకు ముగ్గురు నోడ‌ల్ అధికారుల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆక్సిజ‌న్ కొర‌త ఉంటే దాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షించాల‌ని సీఎం ప్ర‌మోద్ సావంత్ ఆ క‌మిటీని ఆదేశించారు.