Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు

ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు....

Odisha Train Tragedy

Odisha Train Tragedy : ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించనున్నారు. గుర్తించని 28 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు చేస్తామని భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ చెప్పారు.

Also Read : Uttarakhand : నైనిటాల్‌లో లోయలో పడిన బస్సు…ఆరుగురి మృతి, 27 మందికి గాయాలు

రైలు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో అంత్యక్రియలు చేయాలని కోరుతూ ఖుర్దా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. జూన్‌లో ప్రమాదం జరిగినప్పటి నుంచి మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఉంచారు. భువనేశ్వర్ నగరంలోని సత్యనగర్, భరత్‌పూర్‌లోని శ్మశానవాటికలకు ఎయిమ్స్ నుంచి మృతదేహాలను తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని బీఎంసీ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు.

Also Read : Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం

ఎయిమ్స్ భువనేశ్వర్‌కు 162 మృతదేహాలు లభించగా, వాటిలో 81 మృతదేహాలను మొదటి దశలో బాధితుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ నుంచి సేకరించిన ఐదు డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో మృతదేహాలను ఉంచారు. నాడు షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి.