ఏం జరుగుతుంది : భానుప్రియ ఇంట్లో మరో ముగ్గురు బాలికలు

చెన్నై : తెలుగు, తమిళ, మళయాల నటి భానుప్రియ ఇంట్లో మరో రచ్చ మొదలైంది. చెన్నైలోని ఆమె నివాసంలో మరో ముగ్గురు మైనర్ బాలికలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఓ చిన్నారిని వేధిస్తుందంటూ కనీసం తల్లిని కూడా కలిసేందుకు వీలు కల్పించట్లేదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆ బాలికదే తప్పుందంటూ పోలీసులు సైతం తల్లి, కూతురుని అరెస్టు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మైనర్ బాలికతో పని చేయించుకుంటుందని బాలల హక్కు సంఘం అధికారి అచ్యుతరావు.. భానుప్రియపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి)కి ఫిర్యాదు చేశారు. భానుప్రియను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
దాంతో పాటుగా భానుప్రియ ఇంట్లో నలుగురు మైనర్ బాలికలు ఉన్నారని.. కావాలంటే ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని కోరారు. వారందరినీ సెక్స్ వర్క్‌లోకి దింపేందుకు నటి ప్రేరేపిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఒక మధ్య వ్యక్తిని పెట్టుకుని బాలికలను ఆంధ్ర నుంచి చెన్నైకు తీసుకుస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేర చెన్నైలోని టీ నగర్ నివాసంలో దాడులు చేసిన బాలల హక్కుల పరిరక్షణ సమితి అధికారులు ముగ్గురు మైనర్ బాలికలను గుర్తించారు.
అంతకుముందు:
భానుప్రియ నివాసంలో తన కూతురు వేధింపులకు గురవుతోందని.. తల్లి సామర్లకోటలో కొద్ది రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంట్లో పని కోసం 14 ఏళ్ల తమ కూతురు సంధ్యని భానుప్రియ తీసుకెళ్లిందని..ఏడాది కాలంగా కనీసం మాట్లాడనీయటం లేదని తల్లి ప్రభావతి ఆరోపించింది. దీనిపై భానుప్రియ కూడా స్పందించారు.
ఇంట్లో దొంగిలించిన వస్తువులు తిరిగి అడిగినందుకే కేసు పెట్టారని..ఏడాది నుండి బాలిక పద్మ పనిచేస్తోందని…డబ్బు..ఇతర వస్తువులు కనిపించకపోవడంతో బాలికను నిలదీయడం జరిగిందని…పోలీసులకు చెబుతామని హెచ్చరించడం జరిగిందన్నారు. చివరకు బాలిక తన తప్పును ఒప్పుకుందని చెప్పిన భానుప్రియ.. తల్లిని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. దొంగిలించిన కొన్ని వస్తువులను ఆమె తిరిగి తీసుకొచ్చిందని భానుప్రియ చెప్పారు. మిగిలిన వస్తువులను తీసుకొస్తామని ఇంటికి వెళ్లిన బాలిక తల్లి చివరికి తమపైనే కేసు పెట్టిందని చెప్పారు. దీనిపై బాలిక కూడా మీడియతో కూడా మాట్లాడింది. భానుప్రియ ఇంట్లో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. డబ్బు, నగలు దొంగిలించిన తానే తన తల్లికి ఇచ్చినట్లు వెల్లడించినట్లు సమాచారం.