ఫలించని ప్రయత్నాలు : బోరు బావిలో పడ్డ బాలుడు మృతి

ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రార్థనలు కాపాడలేదు. బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్ విల్సన్ మృతి

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 02:09 AM IST
ఫలించని ప్రయత్నాలు : బోరు బావిలో పడ్డ బాలుడు మృతి

Updated On : October 29, 2019 / 2:09 AM IST

ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రార్థనలు కాపాడలేదు. బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్ విల్సన్ మృతి

ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రార్థనలు కాపాడలేదు. బోరు బావిలో పడ్డ బాలుడి కథ విషాదంగా ముగిసింది. తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్ విల్సన్ మృతి చెందాడు. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టిలోని బోరుబావిలో శుక్రవారం(అక్టోబర్ 25,2019) సాయంత్రం సుజిత్ బావిలో పడ్డాడు. సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో 100 అడుగుల దగ్గర బాలుడు చిక్కుకున్నాడు.

బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మూడు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన సహాయక చర్యలు ఫలించలేదు. భౌతికకాయం పూర్తిగా కుళ్లినట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి నుంచి వెలికితీసిన సుజిత్ మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్టోబర్ 25న సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డాడు సుజిత్. 88 అడుగుల లోతు నుంచి సుజిత్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసింది. సుజిత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని అంతా ప్రార్థించారు. కానీ ఫలితం లేకపోయింది.

తొలుత 35 అడుగుల దగ్గర బాబు చిక్కుకున్నాడు. కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా దురదృష్టవశాత్తూ జారిపోయి 90 అడుగుల లోతులో పడిపోయాడు. దీంతో భారీ యంత్రాలను రంగంలోకి దించారు. జర్మనీలో తయారు చేసిన అత్యాధునిక వ్యవస్థని రప్పించారు. ఏకంగా దేశ ప్రధాని.. ఆ బాలుడు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. బాబుని కాపాడేందుకు అన్ని చర్యల్ని చేపట్టాలని ఆదేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం పూజలు చేశారు. తమిళనాడు ప్రభుత్వం మొత్తం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించింది. ఇదంతా చూసిన తల్లి ఇంతమంది ఆశీస్సులున్న తన కొడుకును ఎలాగైనా ప్రాణాలతో చూస్తానని కలలు కంది. కానీ, ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

90 అడుగుల లోతులో 4 రోజుల నుంచి ఆహారం లేక అపస్మారక స్థితికి వెళ్లిన సుజిత్ మరణించినట్లు అధికారులు సోమవారం(అక్టోబర్ 28,2019) రాత్రి 10.30కి గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం వెలువడటంతో డాక్టర్లని పిలిపించి ధ్రువీకరించుకున్నారు. సుజిత్ మరణించాడని అధికారికంగా ప్రకటించారు.