పూణేలో ఐటీ ఉద్యోగంకోసం క్యూలైన్లో 3వేల మంది.. వీడియో వైరల్

భారతదేశంలో ఐటీ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం కష్టతరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

పూణేలో ఐటీ ఉద్యోగంకోసం క్యూలైన్లో 3వేల మంది.. వీడియో వైరల్

IT Job

Updated On : January 26, 2025 / 2:27 PM IST

Pune IT company: భారతదేశంలో ఐటీ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించడం కష్టతరంగా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. పలు కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం, ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వారినే తమ కంపెనీల్లో ఉద్యోగాలకోసం ఎంపిక చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రంలోని పూణెలో ఓ ఐటీ కంపెనీ వద్ద ఉద్యోగంకోసం ఇంజనీరింగ్ విద్యార్థులు, నిరుద్యోగులు క్యూకట్టారు. సుమారు 3వేల మంది ఇంజనీర్లు జూనియర్ డెవలపర్ పోస్టుల కోసం క్యూలైన్లో బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Vizag Fake IAS: నకిలీ ఐఏఎస్ జంట కేసులో కొత్త ట్విస్ట్… చివరకు అద్దెకు ఉంటున్న ఇంటిలోనూ..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సుమారు 3వేల మంది ఇంజనీర్లు వాక్ -ఇన్ ఇంటర్వ్యూ కోసం క్యూలో నిల్చున్నారు. వీరిలో యువతులు కూడా ఉన్నారు. భారీ క్యూలైన్ ఉంది. దేశంలో ఐటీరంగంలో జాబ్ కోసం ఎంత పోటీ నెలకొందనే విషయానికి ఈ ఘటన అద్దం పడుతుందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు ఈ వీడియో.. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో యువ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రచ్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.