ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇన్‌స్పెక్టర్

  • Published By: vamsi ,Published On : May 11, 2019 / 04:25 PM IST
ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇన్‌స్పెక్టర్

Updated On : May 11, 2019 / 4:25 PM IST

ముంబై ఏయిర్‌పోర్ట్‌లో ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య  కలకలం సృష్టిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన 31ఏళ్ల రఘునాధ్ కడం శనివారం(11 మే 2019) సాయంత్రం 6గంటల 45నిమిషాల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్‌పోర్ట్‌లోని 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రఘునాధ్ బ్యాగ్‌లో సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. తన చావుకు ఎవరూ కారణం కాదు అని ఆ లేఖలో రాసి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.