Kodagu School : రెసిడెన్షియల్ స్కూల్ లో 32మంది విద్యార్థులకు కరోనా
కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొడగు జిల్లా మడికెరి టౌన్ కి 12 కి.మీ దూరంలోని గలిబీడులో ఉన్న జవహార్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్

Karnataka
Kodagu School కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొడగు జిల్లా మడికెరి టౌన్ కి 12 కి.మీ దూరంలోని గలిబీడులో ఉన్న జవహార్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్ కి చెందిన మొత్తం 270 మంది విద్యార్ధులు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో 32మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా సోకినవారిలో 22 మంది బాలురు, 10 మంది బాలికలు ఉన్నారు. వీరందూ 9 నుంచి 12వ తరగతి లోపువారే. బాధిత విద్యార్థుల్లో 10 మందికి కోవిడ్ లక్షణాలు కనిపించగా, 22 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. పాఠశాల సిబ్బందిలో ఒకరికి కూడా పాజిటివ్‌గా తేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం కొడగు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బీసీ సతీష్..గలిబీడు స్కూల్ ని సందర్శించారు. జిల్లా కలెక్టర్,ఇతర అధికారులు కూడా స్కూల్ ని సందర్శించారు.
విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నారని న్సిపల్ పంకజాషన్ తెలిపారు. క్యాంపస్ మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు, ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.