Pune-Mumbai Expressway: ముంబై-పూణె హైవేపై ఘోర ప్రమాదం.. పేలిన ట్యాంకర్, నలుగురు మృతి
దీంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారట. రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టిన ట్యాంకర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదం అనంతరం ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.

Pune-Mumbai Expressway: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మీద మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణిస్తున్న మిథనాల్‌తో వెళ్తున్న ఒక ట్యాంకర్ లోనోవాలా సమీపంలో ఒక్కసారిగా బోల్తా పడింది. అనంతరం ట్యాంకర్లో మంటలు వ్యాపించి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టిన ట్యాంకర్ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదం అనంతరం ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
Amit Shah and Prabhas: రాజమౌళి, ప్రభాస్‌తో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా?
లోనావాలా హిల్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగిందని పూణే రూరల్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమేమిటన్నది దర్యాప్తు అధికారులు నిర్ధారిస్తున్నారు. ట్యాంకర్ యాజమాన్యం, సర్వీసు వివరాలను పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ట్యాంకర్ మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో, ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా హైవే సేఫ్టీ పెట్రోలింగ్ అధికారులు రోడ్డు మూసివేశారు. చిన్న వాహనాలను ఖండాలా ఎగ్జిట్ ద్వారా మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Russia Day: ఉక్రెయిన్‌లో రష్యా డే ఉత్సవాలు.. గొప్ప మాతృభూమి అంటూ నినాదాలు
పూణే రూరల్ పోలీసులు, హైవే సేఫ్టీ పెట్రోల్, ఎక్స్‌ప్రెస్‌వే ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాడీ, పూణే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, లోనావాలా అండ్ ఖోపోలీ మునిసిపల్ కౌన్సిల్‌ల నుంచి అగ్నిమాపక దళం, భారత నావికాదళంలోని లోనావాలా ఆధారిత శిక్షణా కేంద్రం ఐఎన్ఎస్ శివాజీ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సహాయక చర్యను ప్రారంభించాయి. లోనావాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ సీతారాం దుబాల్ మాట్లాడుతూ “మేము మొదట ఇది ఆయిల్ ట్యాంకర్ అని అనుకున్నాము. ప్రస్తుతం విచారణలో అందులో మిథనాల్ ఉన్నట్లు తేలింది. మరణించిన నలుగురిలో ఒకరు ట్యాంకర్ క్యాబిన్‌లో ఉండగా, మిగిలిన వారు బ్రిడ్జి కింద ప్రయాణిస్తున్న వాహనాల్లో ఉన్నారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరు ట్యాంకర్ క్యాబిన్‌లో ఉన్నవారు కాగా ఒకరు క్రింద ఉన్న వాహనంపై ఉన్నారట.