Helicopter Crashes Near Kedarnath: కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురి మృతి

ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

Helicopter Crashes Near Kedarnath: కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురి మృతి

Updated On : October 18, 2022 / 12:44 PM IST

Helicopter Crashes Near Kedarnath: ఉత్తరాఖండ్‌లోని ఫాఠా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు, నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వివరించారు. ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కు మంట అంటుకుని కుప్పకూలినట్లు ఇందుకు సంబంధించిన దృశ్యాల ద్వారా తెలుస్తోంది. గరు ఛత్తి ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ శకలాలు దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో తీశారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..