Maharashtra Tiger Attack: మహారాష్ట్రలో ఘోరం.. పులి దాడిలో నలుగురు మహిళలు మృతి
మహిళలు టేకు ఆకుల సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద పులి నక్కి ఉంది.
Maharashtra Tiger Attack: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. పులి పంజా విసిరింది. దాడికి దిగింది. ఈ ఘటనలో ఏకంగా నలుగురు మహిళలు చనిపోయారు. మృతులను కవదు బాబు (45), అనుబాయి (46), సంగీత (36), సునీత (33)గా గుర్తించారు. మృతులది చంద్రపూర్ జిల్లా సిందేవహి తాలూకా గుంజావాహి. సిందేవాహి తాలూకా గుంజావాహి సమీపంలోని ఖైరి శివారు ప్రాంతంలోని అడవిలో ఈ ఘటన జరిగింది.
మహిళలు టేకు ఆకుల సేకరణ కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద పులి నక్కి ఉంది. మహిళలపై దాడి చేసింది. పులి దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నలుగురు మహిళలు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మనుషుల ప్రాణాలు బలితీసుకున్న పులిని పట్టుకోవడానికి గాలింపు కొనసాగుతోంది. కాగా, చంద్రపూర్ జిల్లాలో తరుచూ పులుల దాడుల్లో మనుషులు చనిపోతున్నారు. తాజా ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
Also Read: మళ్లీ కొవిడ్ వచ్చేస్తోందా..? భారీగా పెరుగుతున్న కేసులు.. వారంలోనే 60శాతం పెరుగుదల.. అక్కడ హైఅలర్ట్..
