Jharkhand : పానీపూరీ తిన్న 50 మందికి అస్వస్థత

చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

Jharkhand : పానీపూరీ తిన్న 50 మందికి అస్వస్థత

Panipuri

Updated On : October 21, 2023 / 9:38 PM IST

Jharkhand – Panipuri people ill : జార్ఖండ్ లో పానీపూరీ తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి దగ్గర పానీపూరీలను పిల్లలు, మహిళలు తిన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు.

వాంతులు, విరోచనాలతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, కలుషిత ఆహారం తినడం వల్ల వారంతా అస్వస్థతకు గురైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

Jagtial : ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలు.. తిరిగి అప్పగించిన మహిళా కండక్టర్

అనారోగ్యం పాలైన వారిలో 9-15 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కోసం రాంచీలోని ల్యాబ్ కు పంపామని తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్లనే 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు.