50 ఏళ్ళ వివాహితపై ఏడుగురి గ్యాంగ్ రేప్

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 08:11 AM IST
50 ఏళ్ళ వివాహితపై ఏడుగురి గ్యాంగ్ రేప్

Updated On : August 23, 2020 / 11:14 AM IST

సభ్యసమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పండు ముసలి వారిపై కామాంధులు కన్నేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

అంతేకాదు..సామూహికంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. పాట్నాలో 50 ఏళ్ల వివాహితపై  గ్యాంగ్ రేప్ జరిగింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
15-20 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. 50 ఏళ్ల వయస్సున్నవివాహిత..పాట్నా నుంచి గౌరి చౌక్ లోని తన గ్రామానికి వెళుతోందన్నారు. మార్గమధ్యంలో ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని నమ్మించాడని, అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడన్నారు.

అక్కడనే ఉన్న మరికొంత మంది ఆ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 8 గంటల దర్యాప్తు అనంతరం ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

ఈ ఘటనపై జన్ అధికార పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్ స్పందించారు. ముఖ్యమంత్రి నివాసానికి కేవలం 21 కిలోమీటర్ల దూరంలో జరిగిందంటూ ట్వీట్ చేశారు. బీహార్ ను రేపిస్తాన్ గా సీఎం మార్చివేశారని, అపరాధులను శిక్షించాలని, లేదా సీఎం కుర్చీని వదిలివేయాలని డిమాండ్ చేశారు. ట్వీట్ చేసిన వీడియోలో బాధిత కుటుంబసభ్యుడు మాట్లాడాడు.