Jammu and Kashmir : అదుపు తప్పి లోయలో పడిన టాటా సుమో…ఆరుగురు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

6 Killed, 7 Injured As Car Falls Into Gorge In Poonch District (1)
Jammu and Kashmir Road Acciden in Poonch : టాటా సుమో అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తలించారు.
సురన్‌కోట్‌లోని మర్హా గ్రామం నుంచి బుఫ్లియాజ్ వైపు వెళ్తున్న టాటా సుమో వాహనం రోడ్డుపై అదుపు తప్పి తరన్ వాలీ వద్ద వాగులోకి దూసుకెళ్లింది. రోడ్డుపై నుంచి వెళ్తున్న సుమో తరన్ వలీ వద్ద అదుపుతప్పి లోయలో పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని పుంఛ్ కలెక్టర్ తెలిపారు.