చావుతో పోరాటం : బోరుబావిలో 6 ఏళ్ల బాలుడు

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 03:11 PM IST
చావుతో పోరాటం : బోరుబావిలో 6 ఏళ్ల బాలుడు

మళ్లీ అదే రిపీట్ సీన్. అదే నిర్లక్ష్యం..బోరు బావులు మృత్యుగుంతలుగా మారుతున్నాయి. తెరిచి ఉంచిన బోరు బావులను మూయండి…బాబు అంటూ ఎంత మొత్తుకున్నా..కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా బోరు బావులకు పసిపిల్లలు బలవుతున్నారు. ఇటీవలే ఎన్నో ఘటనలు వెలుగుచూశాయి. అందులో కొందరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాజాగా మహారాష్ట్రలోని పూణే జిల్లా అంబేగావ్‌లో తెరిచి ఉంచిన బోరుబావిలో 6 ఏళ్ల బాలుడు పడిపోయాడు. బాలుడిని రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ కొడుకు క్షేమంగా బయటకు రావాలని పేరెంట్స్ వేడుకుంటున్నారు. 

అంబేగావ్ గ్రామంలో ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ 200 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడిని రక్షించే పనులు మొదలు పెట్టాయి. బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. క్షేమంగా అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అదనంగా ఇతర సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుంటున్నారు. 

పడిపోయిన బాలుడు రవి పండింట్‌గా గుర్తించినట్లు..ఇతని తండ్రి రోడ్ కంట్రక్షన్ సైట్‌లో పని చేస్తుంటాడని మంచార్ పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ పేర్కొన్నారు. 10 ఫీట్ల లోతులో ఉన్నట్లు..గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్సిజన్ లోనికి పంపిస్తున్నట్లు తెలిపారు.