Chambal River : రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. చంబల్ నదిలో పడ్డ కారు, 9 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా ప్రయాణిస్తున్న కారు చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం చెందారు.

8 People Died After Their Car Fell Off Chhoti Puliya Nto The Chambal River

Chambal River : రాజస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదం శనివారం రాత్రి జరిగింది.  పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న కారు అతివేగంతో నయాపురా సమీపంలో చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా 9 మంది దుర్మరణం చెందారు. వీరంతా వివాహానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని చెబుతున్నారు. కారులోంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.


అనంతరం నదిలో గల్లంతైన వారందరి మృతదేహాలను బయటకు తీశారు. వధువును తీసుకొచ్చేందుకు పెళ్లి ఊరేగింపుతో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం చౌత్ కా బర్వాడ నుంచి ఉజ్జయినికి కారులో ఊరేగింపుతో పెళ్లిబృందం బయలుదేరింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉన్నారు.

చీకటి పడటంతో నది సరిహద్దు డ్రైవర్‌ కనిపించలేదు. కోటాలోని చోటి పులియా ప్రాంతంలో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు.. పక్కనే ఉన్న చంబల్ నదిలోకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ఎంత మంది చిన్నారులు, మహిళలు ఉన్నారనేది తెలియరాలేదు. ఉదయం ప్రమాద సమాచారం అందడంతో పోలీసులు డైవర్ల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పడిన కారును క్రేన్ సాయంతో వెలికితీశారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Read Also : Accident: అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి