Food poision : షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆసుపత్రిలో..

తాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా, మరో 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్ లో.............

Food poision  :  ఇటీవల కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు మిగిలిపోయిన ఫుడ్ ని వేడి చేసి, లేదా మరేదో పద్దతిలో నిల్వ చేసి మళ్ళీ దానినే అమ్ముతున్నారు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయి పలువురు అస్వస్థతకి గురవుతున్నారు. ఇలాంటి వాటిపై గతంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్ళీ అలాగే చేస్తున్నారు. తాజాగా ఓ షాపులో షవర్మా తిని ఒకరు మృతి చెందగా, మరో 18 మంది ఆసుపత్రి పాలయ్యారు.

ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో ఆదివారం జరిగింది. ఓ ట్యూషన్ కేంద్రానికి దగ్గర్లో ఉన్న జ్యూస్ షాప్ లో షవర్మా కూడా అమ్ముతారు. అక్కడ ట్యూషన్ కి వచ్చే పిల్లలు ఇక్కడే షవర్మా తింటారు, జ్యూస్ తాగుతారు. నిన్న(మే 2న) కూడా అలాగే కొంతమంది విద్యార్థులు ఇక్కడ షవర్మా తిన్నారు. ఆహారం కలుషితం కావడంతో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గుయారయ్యారు. ఇందులో ఓ 16 ఏళ్ళ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.

ICMR On Corona 4thwave : కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్.. ఐసీఎంఆర్ కీలక ప్రకటన

ఆ జ్యూస్‌ షాప్‌లో షవర్మా తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో జ్యూస్‌ షాప్‌పై కేసు నమోదు చేసి సీజ్‌ చేశారు. ఇక ఆసుపత్రిలో చేరిన మిగిలిన విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు