Odisha’s Kandhamal : నది దాటాలంటే..తీగపై నడవాల్సిందే

tightrope : దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఒక గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే.. పెద్ద సాహసాలే చేయాల్సి వస్తోంది. పొంగి పొర్లుతున్న వరద ప్రవాహాన్ని దాటేందుకు కొంతమంది సోంతంగా బ్రిడ్జీలు, వంతెనలు నిర్మించుకున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కానీ.. ఒడిశా రాష్ట్రంలో కొంధమాల్ జిల్లా కె. సువాగం సమితి గంజిబాడి గ్రామ పంచాయతీ బిరిండాపొడా గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడ 100 కుటుంబాలున్నాయి. బయటకు వెళ్లాలంటే..కళిపెను నదిని దాటాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నదిని దాటడానికి ఓ తీగను ఏర్పాటు చేసుకున్నారు. అటు..ఇటు వైపు పట్టుకోవడానికి తాళ్లను కట్టారు.
కింద నది..పైన తీగపై నడక..ఏ మాత్రం పట్టు తప్పినా..అంతే సంగతులు. ప్రాణాలు పోతాయి. ఈ విషయం తెలిసినా..ప్రమాదకరమైన స్థితిలో దాటుతున్నారు. నిత్యావసరాలు, ఫించన్లు ఇలా ఏ అవసరం వచ్చినా..ఈ నది దాటి వెళ్లాల్సిందే. వంతెనను ఏర్పాటు చేయాలని ఎన్నోమార్లు అధికారులను అవతలి వైపుకు వెళ్లాలంటే..తీగపై నడవాల్సిందే